20 Killed
-
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Published Date - 07:10 AM, Mon - 2 September 24