World Women’s Boxing Championship : నీతూ, స్వీటీ పసిడి పంచ్
మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న మన బాక్సర్లు తుది పోరులోనూ..
- By Naresh Kumar Published Date - 09:00 PM, Sat - 25 March 23

World Women’s Boxing Championship : మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ (World Women’s Boxing Championship) లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న మన బాక్సర్లు తుది పోరులోనూ అదరగొడుతున్నారు. తాజాగా నీతూ గంగాస్, స్వీటీ బూరా పసిడి పంచ్ లు విసిరారు. 48 కేజీల విభాగంలో మంగోలియన్ ప్లేయర్‌పై గెలిసి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. రెండు సార్లు యూత్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ యువ బాక్సర్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి రౌండ్ నుంచే పూర్తి ఎటాకింగ్ చేయడం ద్వారా పై చేయి సాధించింది.
దీంతో ఐదుగురు జడ్జీలు ఆమెకు అనుకూలంగా బౌట్‌ను ప్రకటించారు.తర్వాత మంగోలియన్ బాక్సర్ ప్రతిదాడికి ప్రయత్నించినా.. నీతూదే పైచేయిగా నిలిచింది. 22 ఏళ్ల ఈ యువ బాక్సర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‍లో రెండో సారి పోటీ పడింది. ఈ విజయంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ (World Women’s Boxing Championship) లో స్వర్ణం గెలిచి ఆరో భారత మహిళా బాక్సర్ గా నీతూ రికార్డులకెక్కింగి. గతంలో మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీఆర్ఎల్, లేఖా కేసి, నిఖత్ జరీన్ ఈ టోర్నీలో స్వర్ణాలు గెలుచుకున్నారు. మేరీ కోమ్ 2002, 2005, 2006, 2008, 2010, 2018 లలో స్వర్ణాలు గెలవగా.. సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ 2006 లోనూ, హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ గత ఏడాదీ స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.
మరోవైపు 81 కేజీల విభాగంలో స్వీటీ బూరా గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ పై సంచలన విజయం సాధించింది స్వీటీ. గతంలో సిల్వర్ మెడల్ తోనే సరిపెట్టుకున్న స్వీటీ ఈసారి ఛాంపియన్ గా నిలవాలన్న పట్టుదలతో తుది పోరులో అదరగొట్టింది. ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్ లతో విరుచుకుపడింది. రెండో రౌండ్ లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచి స్వర్ణం కైవసం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఆమెకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటికే నీతూ గంగాస్, స్వీటీ బూర గోల్డ్ మెడల్స్ గెలవగా.. ఆదివారం హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్, లవ్లీనా ఫైనల్ మ్యాచ్ లు ఆడనున్నారు.
Also Read: WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్

Related News

Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?
Apple - Indian Student : అవసరమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. అవసరమే ఆవిష్కరణలను సృష్టిస్తుంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ అస్మి జైన్ కు గొప్ప ఛాన్స్ లభించింది.