New Zealand vs South Africa : దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం
New Zealand vs South Africa : కేన్ విలియమ్సన్ విజృంభించి శతకాన్ని నమోదు చేయగా, కాన్వే అద్భుత ఇన్నింగ్స్ ఆడినా దురదృష్టవశాత్తూ 97 పరుగుల వద్ద అవుటయ్యాడు
- Author : Sudheer
Date : 10-02-2025 - 7:23 IST
Published By : Hashtagu Telugu Desk
ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా(New Zealand vs South Africa)ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. గడాఫీ స్టేడియం(Gaddafi Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే (Kane Williamson, Devon Conway) తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కేన్ విలియమ్సన్ విజృంభించి శతకాన్ని నమోదు చేయగా, కాన్వే అద్భుత ఇన్నింగ్స్ ఆడినా దురదృష్టవశాత్తూ 97 పరుగుల వద్ద అవుటయ్యాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన న్యూజిలాండ్ విజయంలో కీలకంగా మారింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు విజయం సాధించాలంటే సీనియర్ బ్యాట్స్‌మెన్ నిలబెట్టుకోవాలి. అందులోనూ కెప్టెన్ విలియమ్సన్ కీలకంగా నిలిచాడు. 72 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన విలియమ్సన్ చివరికి 113 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా 97 పరుగులతో జట్టుకు శక్తినిచ్చాడు. వీరిద్దరి రెండో వికెట్ భాగస్వామ్యమే న్యూజిలాండ్ విజయానికి బలమైన పునాది వేసింది.
Reliance Spinner: రూ.10కే రిలయన్స్ ‘స్పిన్నర్’.. చౌకగా స్పోర్ట్స్ డ్రింక్
దక్షిణాఫ్రికా ముందు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే మాథ్యూ బ్రిట్జ్కే 150 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అతనికి వియాన్ ముల్డర్ 64 పరుగులతో సహకరించాడు. దక్షిణాఫ్రికా మంచి స్కోరు చేసినప్పటికీ, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఆ జట్టు బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ’రూక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. మైఖేల్ బ్రేస్‌వెల్ 1 వికెట్ తీసుకున్నాడు. అయితే, భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే అద్భుత ప్రదర్శన చూపారు. వారి భాగస్వామ్యం దక్షిణాఫ్రికాపై కివీస్‌కు ఘన విజయాన్ని అందించింది.