What Is Yo Yo Test : యోయో టెస్ట్ పై హాట్ డిబేట్.. ఏమిటది ? ఎలా చేస్తారు ?
What Is Yo Yo Test : క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన టాపిక్ .. యోయో టెస్ట్. మన ఇండియా టీమ్ ప్లేయర్స్ కు రీసెంట్ గా యోయో టెస్టులు చేశారు..
- By Pasha Published Date - 03:22 PM, Sun - 27 August 23

What Is Yo Yo Test : క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన టాపిక్ .. యోయో టెస్ట్.
మన ఇండియా టీమ్ ప్లేయర్స్ కు రీసెంట్ గా యోయో టెస్టులు చేశారు..
వాటిలో ప్లేయర్స్ కు వచ్చిన స్కోర్ పై అందరికీ ఆసక్తి పెరిగింది.
ఈనేపథ్యంలో మనం యోయో టెస్ట్ గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Also read : NTR Coins Viral : రేపే ‘ఎన్టీఆర్ కాయిన్’ విడుదల.. విశేషాలివీ..
స్కిల్ తో పాటు ఫిట్ నెస్ ఉన్న ప్లేయర్స్ ను టీమ్ లోకి తీసుకునేందుకు యోయో టెస్ట్ ను నిర్వహిస్తారు. దాదాపు గత ఐదేళ్లుగా ఈ టెస్టును మన భారత క్రికెట్ టీమ్ వినియోగిస్తోంది. గతంలో ఇండియా టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా శంకర్ బసు ఉన్న టైంలో ప్లేయర్స్ కు యోయో టెస్టులు చేయడం మొదలైంది. అప్పట్లో మన టీమ్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ, కోచ్ గా ఉన్న రవిశాస్త్రి కూడా యోయో టెస్టుకు సపోర్ట్ చేశారు. చివరకు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి స్టార్ ప్లేయర్స్ కూడా యోయో టెస్ట్ ను పాస్ కాలేక సతమతం అయ్యేవారట. కోహ్లి ఇండియా కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు యోయో టెస్టు అమలు సాఫీగా సాగింది. టీమిండియా కెప్టెన్, కోచ్ మారినప్పటి నుంచి ప్లేయర్స్ కు యోయో టెస్టు నిర్వహించడంపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ కు టైం దగ్గరపడింది. దీంతో మరోసారి యోయో టెస్టును తప్పనిసరి చేశారు.అందుకే మళ్లీ దానిపై డిబేట్ జరుగుతోంది. గతంలో యోయో టెస్ట్ పాస్ మార్కులు 16.1గా ఉండగా, ఇప్పుడు 16.5కు పెంచేశారు. రీసెంట్ గా యోయో టెస్ట్ లో శుభ్‌మన్ గిల్ 18.5 స్కోరుతో టాప్ ప్లేస్ లో నిలిచాడట.
Also read : 7 Seater Cars: త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న 7-సీటర్ కార్లు ఇవే..!
యోయో టెస్ట్ ఇలా చేస్తారు..
వాస్తవానికి యోయో టెస్టు వినియోగానికి తొలి బీజాలు ఫుట్ బాల్ గేమ్ లో (What Is Yo Yo Test) పడ్డాయి. డెన్మార్క్‌కు చెందిన సాకర్ సైకాలజిస్ట్ జెన్స్ బాంగ్స్‌బో ఈ టెస్టు మెథడ్ ను డెవలప్ చేశారు. చాలా ఆలస్యంగా దీన్ని క్రికెట్ లో వాడటం మొదలైంది. ప్లేయర్ రన్ చేసే స్పీడ్ ను పెంచి.. వారి పేషియన్సీ లెవల్స్ ను అంచనా వేయడమే యోయో టెస్ట్ ప్రధాన లక్ష్యం. ఈటెస్టులో భాగంగా ఒక బీప్ సౌండ్, మరో బీప్ సౌండ్ మధ్య వ్యవధిలో ప్లేయర్ యావరేజ్ గా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల దూరం రన్ చేయాల్సి ఉంటుంది. యోయో పరీక్షలో 2 లెవల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవల్ లో మొదటి బీప్ వచ్చినపుడు ప్లేయర్ రన్నింగ్ మొదలుపెట్టాలి. ప్లేయర్ కు 20 మీటర్ల దూరంలో ఇటు అటు కొన్ని సూచిక బోర్డులను ఉంచుతారు. ఆ బోర్డుల మధ్యే రన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేజ్ లో మూడు బీప్స్ ఇస్తారు. ప్రతి నిమిషానికీ బీప్ ఇచ్చే సమయాన్ని తగ్గిస్తారు. బీప్‌ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే అది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగే టెస్ట్. ఇక సెకండ్ లెవల్ లో బీప్ చేయగానే ప్లేయర్ అవతలి వైపున ఉన్న కోచ్‌ను చేరుకోవాలి. మూడో బీప్ ఇచ్చే సమయానికి ఎక్కడి నుంచి రన్ మొదలుపెట్టాడో అక్కడికి చేరుకోవాలి. రెండో బీప్ వచ్చేసరికి అవతలి వైపునకు ఒకవేళ వెళ్లలేకపోతే.. కనీసం మూడో బీప్ సమయానికైనా టార్గెట్ గా ఇచ్చిన ప్లేస్ కు చేరుకోవాలి. అలాా చేయలేకపోతే ఫస్ట్ వార్నింగ్ ను ఇష్యూ చేస్తారు. మూడు వార్నింగ్ లు వస్తే.. యోయో టెస్ట్ లో ఫెయిల్ అయినట్టే.