BGT 2023: ఈ హిట్టర్లకు ఏమైంది అయ్యా… ఈ చెత్త బ్యాటింగ్ ఏంటి?
ఆ బ్యాటర్లు మైదానంలోకి దిగితే పరుగుల వరదే. అనేకమైన గత రికార్డులను తిరగరాశారు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లుగా చలామణిలో ఉన్నారు. కానీ ప్రస్తుతం పేలవ
- By Anshu Published Date - 07:25 PM, Tue - 21 February 23

BGT 2023: ఆ బ్యాటర్లు మైదానంలోకి దిగితే పరుగుల వరదే. అనేకమైన గత రికార్డులను తిరగరాశారు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లుగా చలామణిలో ఉన్నారు. కానీ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నారు. ఈ ఆటగాళ్లు ఎవరో కాదు… భారత, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు, స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్. బోర్డర్ గవాస్క ర్ ట్రోఫీ-2023లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్ట్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవటం గమనార్హం.
గతమేమో ఘనమన్నట్లు చూసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చెలరేగిపోతారనుకున్నారు. కానీ అలా జరగలేదు. కనీసం ఎవ్‌రేజ్ పర్ఫామెన్స్ కూడా చేయలేదు. అయితే అందరి అంచనాలకు తల్లకిందులు చేశారు. కోహ్లి, స్మిత్ దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్‌కు ముందు జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో స్మి త్.. తన శైలికి భిన్నంగా రెండు విధ్వంసకర శతకాలతో చెలరేగిపోగా.. దాదాపు 3 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో మూడంకెల స్కో ర్లు చేసిన కోహ్లి, టీ20, వన్డేల్లో శతకాలు సాధించాడు.
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో స్మి త్ 62 పరుగులు చేయగా.. కోహ్లి కేవలం 12 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్
బ్యాటర్లంతా కట్టగట్టుకుని విఫలమైనప్పటికీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ శతకంతో 120 పరుగులు చేశారు. భారత ఆల్
రౌండర్లు రవీంద్ర జడేజా (70), అక్షర్ పటేల్ (84) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలు చేశారు. విమర్శకుల నుంచి సైతం శభాష్
అనిపించుకున్నారు. బ్యా టింగ్‌కు ఏమాత్రం సహకరించలేదని ఆసీస్ క్రికెటర్లు నిందలు మోపిన ఈ పిచ్‌పై హిట్‌మ్యాన్, జడ్డూ, అక్షర్‌లు ఇరగదీసి, ఆసీస్ తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసిందని ప్రపంచానికి చాటి చెప్పారు.
ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ సంగతి చూస్తే.. ఈ మ్యాచ్‌లోనూ స్మిత్, కోహ్లి దారుణంగా నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ డకౌట్ కాగా.. కోహ్లి 44 పరుగులు చేసి కాస్త గట్టెకారు. ఈ ఇన్నింగ్స్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా కోహ్లి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో
స్మిత్ 9 పరుగులు చేయగా.. కోహ్లి 20 పరుగుల వద్ద కీపర్‌కి చిక్కిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్ల తా తక్కువ స్కో ర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ.. ఖ్వా జా (81), హ్యాండ్స్ కోంబ్ (72 నాటౌట్), అక్షర్ పటేల్ (74) అర్ధ సెంచరీలతో రాణించారు. కష్టతరం అనుకున్న పిచ్‌లపై ఇతర బ్యాటర్లు ముఖ్యంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు కాని వారు రాణిస్తుంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్లు కోహ్లి, స్మిత్ తేలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సిరీస్‌లో కోహ్లి 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 76 పరుగులు చేయగా.. స్మిత్ 4 ఇన్నింగ్స్‌ల్లో 71 పరుగులు మాత్రమే చేశాడు.