HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Victory India The First Under 19 Womens T20 World Cup

Team India: జయహో భారత్.. తొలి అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ సొంతం

టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. ఐసీసీ మొదటిసారి నిర్వహిస్తున్న తొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ని గెలిచి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.

  • Author : Anshu Date : 29-01-2023 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Image 2023 01 29 At 20.28.16
Whatsapp Image 2023 01 29 At 20.28.16

Team India: టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. ఐసీసీ మొదటిసారి నిర్వహిస్తున్న తొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ని గెలిచి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. క్రికెట్ కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లండ్ ను టీమిండియా మహిళ ప్లేయర్లు చిత్తుచిత్తుగా ఓడించారు. ఇంగ్లండ్ ను టీమిండియా 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని.. ఇంగ్లండ్ ను టీమిండియా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే పటిష్టమైన ఫీల్డింగ్ తో పాటు అద్భుతమై బౌలింగ్ తో కేవలం 68 పరుగులకే ఇంగ్లండ్ ను అమ్మాయిలు కట్టడి చేయగలిగారు. కెప్టెన్ షఫాలీ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఎందుకు ప్లస్ గా మారిందో.. తర్వాత వికెట్లు వరుసగా పోతుంటే అందరికీ తెలిసి వచ్చింది.

మొదటి ఓవర్ నాలుగో బంతి నుండి ప్రారంభమైన వికెట్ల పతన పదో ఓవర్ చివరి బంతి వరకు సాగింది. త్రిష, అర్చనా దేవిలు రెండు అద్భుతమైన క్యాచులు పట్టడం, సౌమ్యా తివారీ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం లాంటి అనేక విషయాలు ఇంగ్లండ్ ను కేవలం 68 పరుగులకే పరిమితమయ్యేలా చేశాయి. ఇక బౌలర్లు అర్చనాదేవి, చోప్రాకు చెరో రెండు వికెట్లు, షెఫాలీ, సోనమ్ యాదవ్ లకు తల ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మహిళల జట్టు 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సాధించింది. సౌమ్య (24) త్రిష (24) వెర్మ (15) శ్వేత (5)లు చేయగా.. టీమిండియా ఐసీసీ నిర్వహించిన తొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న మొదటి టీంగా చరిత్రలోకెక్కింది. అయితే ఈ విజయంలో మన తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష తన బ్యాటింగ్ తో అదరగొట్టింది. మూడు ఫోర్లతో 24 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC
  • team india
  • Under 19
  • Women’s T20
  • World record

Related News

    Latest News

    • Kangana Ranaut: కంగనా రనౌత్ మ్యారేజ్ చేసుకుందా? మెడలో నల్లపూసలు.. వైరల్ అవుతున్న వీడియో

    • Anasuya Bharadwaj: మూడు సినిమాల నుంచి ఒక్కసారిగా తీసేశారు.. అనసూయ భావోద్వేగ వ్యాఖ్యలు

    • Harish Rao: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు షాకింగ్ కామెంట్స్

    • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

    • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

    Trending News

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd