Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Team Indias Schedule For Limited Over Series Against Australia South Africa

Team India: హైదరాబాద్‌లో టీ ట్వంటీ మ్యాచ్… ఎప్పుడో తెలుసా ?

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఉక్కిరిబిక్కిరి కానుంది.

  • By Naresh Kumar Published Date - 09:18 PM, Thu - 4 August 22
Team India: హైదరాబాద్‌లో టీ ట్వంటీ మ్యాచ్… ఎప్పుడో తెలుసా ?

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఉక్కిరిబిక్కిరి కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని విండీస్‌ టూర్‌లో పర్యటిస్తున్న భారత్ జింబాబ్వే పర్యటన తర్వాత ఆసియా కప్ ఆడనుంది. అనంతరం స్వదేశంలో పలు సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది.

ఆసియా కప్‌ ముగిసిన తర్వాత టీమిండియా దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బీసీసీఐ ఈ మధ్యలో రెండు సిరీస్‌లను ప్లాన్‌ చేసింది. సెప్టెంబర్‌ 20-25 మధ్యలో ఆస్ట్రేలియా, సెప్టెంబర్‌ 28-అక్టోబర్‌ 11 మధ్యలో సౌతాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. భారత పర్యటనలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ ఆడనుండగా.. దక్షిణాఫ్రికా 3 టీ ట్వంటీలు, 3 వన్డేలు ఆడనుంది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మొహాలీ, నాగ్‌పూర్, హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి టీ ట్వంటీ సెప్టెంబర్ 20న మొహాలీలోనూ, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లోనూ జరగనుంది. ఇక ఆస్ట్రేలియాతో మూడో టీ ట్వంటీకి హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం చివరరి సారిగా 2019 డిసెంబర్‌లో అంతర్జాతీయ టీ ట్వంటీకి ఆతిథ్యమిచ్చింది.

ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ ఇక్కడ జరగనుండడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్‌కు తిరువనంతపురం, గౌహతి, ఇండోర్వే దికలుగానిర్ణయించారు.  అటు వన్డే సిరీస్‌కు లక్నో, రాంఛీ, ఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నాయి. సెప్టెంబర్ 28న తొలి టీ ట్వంటీ తిరువనంతపురంలోనూ, అక్టోబర్ 2న రెండో మ్యాచ్ గౌహతీలోనూ, మూడో టీ ట్వంటీ అక్టోబర్ 4న ఇండోర్‌లోనూ జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 6న లక్నోలో తొలి వన్డే, అక్టోబర్ 9న రెండో వన్డే రాంఛీలోనూ జరగనుండగా… అక్టోబర్ 11న మూడో వన్డేకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి సిరీస్‌. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 22 నుంచి టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం కానుంది.

Tags  

  • australia
  • busy schedule
  • team india

Related News

Shikhar Dhawan: సెలక్టర్లపై గబ్బర్ సంచలన వ్యాఖ్యలు

Shikhar Dhawan: సెలక్టర్లపై గబ్బర్ సంచలన వ్యాఖ్యలు

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ టీ ట్వంటీ కెరీర్ ఇక ముగిసినట్టేనా...యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైన వేళ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లాన్స్ లో గబ్బర్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.

  • Asia Cup Squad: కోహ్లీ,కెఎల్ రాహుల్ ఇన్…బూమ్రా ఔట్ ఆసియాకప్ కు భారత జట్టు

    Asia Cup Squad: కోహ్లీ,కెఎల్ రాహుల్ ఇన్…బూమ్రా ఔట్ ఆసియాకప్ కు భారత జట్టు

  • India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

    India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

  • Hardik Pandya: పాండ్యాకు బిగ్ ప్రమోషన్‌ ఖాయమే

    Hardik Pandya: పాండ్యాకు బిగ్ ప్రమోషన్‌ ఖాయమే

  • Florida T20: భారత్‌, విండీస్ ఆటగాళ్ళ వీసా సమస్య క్లియర్

    Florida T20: భారత్‌, విండీస్ ఆటగాళ్ళ వీసా సమస్య క్లియర్

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: