IPL 2022 : టాప్-4 పై కన్నేసిన సన్ రైజర్స్
ఐపీఎల్ 15వ సీజన్ లో సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు మారిపోతూ ఉన్నాయి. ఇరు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 04:42 PM, Thu - 5 May 22

ఐపీఎల్ 15వ సీజన్ లో సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు మారిపోతూ ఉన్నాయి. ఇరు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్-4లోకి ఎగబాకింది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు జట్టు .. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడింట్లోనూ విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన చిన్ని సూపర్ కింగ్స్ జట్టుకి ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఈ సీజన్ పాయింట్ల పట్టికలో హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..ఆ తర్వాత కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 14 పాయింట్లతో రెండో స్థానంలోనిలిచింది.. ఇక రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 12 పాయింట్లతో వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ జట్టు కూడా 10 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో 7వస్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు 8 పాయింట్లతో 8వ ప్లేస్ లో నిలిచింది.
ఇక ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబద్ హైదరాబాద్ జట్టు గనుక విజయం సాధిస్తే.. ప్రస్తుతం పాయింట్లపట్టికలో 12 పాయింట్లతో ఆర్సీబీని వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి ఎగబాకుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్సీబీ నెట్ రన్‌రేట్ -0.444గా ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నెట్ రన్‌రేట్ +0.471గా ఉంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ గెలిస్తే టాప్ 4లోకి ప్రవేశిస్తుంది.