Pakistan Demolish Hongkong: హాంకాంగ్ పై పాకిస్థాన్ భారీ విజయం
భారత్ తో మ్యాచ్ లో ఓడిన పాకిస్థాన్ పసికూన హాంకాంగ్ పై భారీ విజయాన్ని అందుకుంది.
- By Naresh Kumar Published Date - 11:29 PM, Fri - 2 September 22

భారత్ తో మ్యాచ్ లో ఓడిన పాకిస్థాన్ పసికూన హాంకాంగ్ పై భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ చెలరేగి 155 రన్స్ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ త్వరగానే బాబర్ ఆజమ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్‌లు మరో వికెట్ పడకుండా ఆడారు. ఇద్దరి మధ్య వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఫఖర్ జమాన్ ఔటైనప్పటికి.. చివర్లో కుష్‌దిల్ షా విధ్వంసంతో పాక్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 57 బంతుల్లో 78 నాటౌట్, ఫఖర్ జమాన్ 41 బంతుల్లో 53, చివర్లో కుష్‌దిల్ షా 15 బంతుల్లో 35 పరుగులు చేశారు.హాంగ్ కాంగ్ బౌలర్లలో ఎహ్‌సాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.
చేజింగ్ లో హాంకాంగ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. కేవలం 38 రన్స్ కే కుప్పకూలింది. పాక్ బౌలర్ల ధాటికి మూడో ఓవర్ నుంచే ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. హాంకాంగ్ జట్టులో ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేక పోయారు. టీ ట్వంటీ ల్లో పాకిస్థాన్ కు ఇదే అటు పెద్ద విజయం. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 , నవాజ్ 3 వికెట్లు పడగొట్టారు. సూపర్ 4 స్టేజ్ లో ఆదివారం భారత్ తోనే పాక్ రెండోసారి తలపడనుంది.
Related News

T20 World Cup: మెరిసిన బాబర్, రిజ్వాన్.. ఫైనల్లో పాకిస్తాన్
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సిడ్నీ వేదికగా జరిగిన సెమీస్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.