Cracks On Its Own: నిర్మాణ రంగంలో సంచలనం.. బిల్డింగ్ పై ఏర్పడే పగుళ్లను ఆటోమేటిక్ గా పూడ్చివేసే బ్యాక్టీరియా
శరీరానికి అయ్యే గాయాలను స్వయంగా మానుచుకునే శక్తి ఎవరికీ ఉండదు..అలాంటి సీన్స్ ను మీరు సైన్స్ ఫిక్షన్ మూవీస్ లోనే చూసి ఉంటారు. నిజంగా ఎవరికైనా అలాంటి పవర్ ఉంటే.. దాన్ని సెల్ఫ్ హీలింగ్ పవర్ అంటారు. ఇప్పుడు ఇలాంటి పవర్స్ ఉన్నవారు లేరు. అయితే ప్రాచీన కాలంలో మన పూర్వీకుల్లో చాలామందికి సెల్ఫ్ హీలింగ్ పవర్స్ ఉన్నాయనే దానికి ఒక ఆధారం దొరికింది.
- By Hashtag U Published Date - 06:00 PM, Sat - 14 January 23

శరీరానికి అయ్యే గాయాలను స్వయంగా మానుచుకునే శక్తి ఎవరికీ ఉండదు..అలాంటి సీన్స్ ను మీరు సైన్స్ ఫిక్షన్ మూవీస్ లోనే చూసి ఉంటారు. నిజంగా ఎవరికైనా అలాంటి పవర్ ఉంటే.. దాన్ని సెల్ఫ్ హీలింగ్ పవర్ అంటారు. ఇప్పుడు ఇలాంటి పవర్స్ ఉన్నవారు లేరు. అయితే ప్రాచీన కాలంలో మన పూర్వీకుల్లో చాలామందికి సెల్ఫ్ హీలింగ్ పవర్స్ ఉన్నాయనే దానికి ఒక ఆధారం దొరికింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్శిటీతో పాటు ఇటలీ, స్విట్జర్లాండ్‌ల ల్యాబ్‌లు కలిసి ఇటీవల జరిపిన రిసెర్చ్ లో ఆశ్చర్యపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి.అత్యంత పురాతన భవనాలకు ఇటలీలోని రోమ్ నగరం పెట్టింది పేరు. అక్కడున్న స్మారక చిహ్నాలను స్టడీ చేసిన శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు. పురాతన రోమ్ వాస్తుశిల్పులు భవనాలను నిర్మించేటప్పుడు హాట్ మిక్సింగ్ టెక్నిక్‌ను ఉపయోగించారని తేల్చారు. ఈ టెక్నిక్ కారణంగా భవనంపై ఉండే సిమెంట్ కు స్వల్ప పగుళ్లు ఏర్పడినా.. వెంటనే అది ఆటోమేటిక్ గా నిండిపోతుంది.
దీని కారణంగా భవనాలపై ఏర్పడే పగుళ్లు విస్తరించడం అనేది పెద్దగా జరగదు. హాట్ మిక్సింగ్ కోసం ఆనాడు వాడిన మెటీరియల్ లో కాల్షియం కార్బోనేట్ కూడా ఉన్నట్లు తెలిపారు. హాట్ మిక్సింగ్ అనేది అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద చేస్తారు. తద్వారా ఎక్సోథర్మిక్ ప్రతిచర్య అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే.. సిమెంటులోపల ఆటోమేటిక్ గా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి సిమెంట్‌లోనే బంధింపబడి ఉండి సెల్ఫ్ హీలింగ్ పవర్ ను పొందుతుంది. అందుకే ఆనాటి రోమన్ సిమెంట్ తో కట్టిన భవనాల్లో పగుళ్లు ఏర్పడినా వాటంతట అవే సెల్ఫ్ హీలింగ్ చేసుకొని వందల ఏళ్లుగా నిలబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ” సైన్స్ అడ్వాన్సెస్” జర్నల్‌లో ప్రచురితమైంది.
టెస్టింగ్ ఇలా చేశారు
పురాతన భవనాల నాణ్యతను పరీక్షించడానికి పరిశోధకుల బృందం ఆ భవనాల సిమెంట్ శాంపిల్స్ సేకరించింది. దాన్ని హాట్ మిక్సింగ్ చేసి.. బలవంతంగా దెబ్బతినేలా చేశారు. అనంతరం సిమెంట్ పగుళ్లలో నీరు పోశారు. రెండు వారాల తర్వాత ఆ పగుళ్లను పరిశీలించగా వాటంతట అవే పూడిపోయి, అందులోని నీరు ఇంకిపోయినట్లు తేలింది. ఆనాటి సిమెంట్ లో దాగి ఉన్న వేడి వల్ల ఇలా జరిగిందని వెల్లడైంది.
పురాతన భవనాల నిర్మాణానికి
అగ్నిపర్వతాల బూడిదతో తయారు చేసిన సున్నం మిశ్రమం వాడారని ఈ స్టడీలో తేటతెల్లమైంది.భవనాలు, రోడ్లు, కాలువలు, వంతెనల నిర్మాణానికి కూడా ఇదే మెటీరియల్ వాడారని గుర్తించారు. పురాతన కాలంలో సిరామిక్, ఇసుక, సున్నంతో పాటు అగ్నిపర్వతాల బూడిదను హాట్ మిక్స్ చేసే వారని శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకే ఆనాటి సిమెంటు అంత అత్యధిక వేడి దాగి ఉండేదని విశ్లేషించారు. ఆ కారణం వల్లే దానికి సెల్ఫ్ హీలింగ్ పవర్ వచ్చిందని కామెంట్ చేశారు.
బిల్డింగ్ పగుళ్లు పూడ్చే సముద్ర బ్యాక్టీరియా..?
పురాతన టెక్నిక్ స్పూర్తితో ఆధునిక సెల్ఫ్ హీలింగ్ కాంక్రీటు తయారీకి కూడా పని ప్రారంభమైంది. దానిలో ఒక రకమైన బ్యాక్టీరియా దాగి ఉంటుంది. అది భవనంలో ఎలాంటి పగుళ్లు ఏర్పడినా భర్తీ చేస్తుంది. ఈ టెక్నిక్ ను అభివృద్ధి చేసేందుకు సివిల్ ఇంజనీరింగ్‌తో పాటు, మెరైన్ బయాలజీ కూడా ఉపయోగించారు. ఒక సముద్ర బ్యాక్టీరియాను ఉపయోగించి భవనాల లైఫ్ టైం ను పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయనేది వెరీ క్లియర్.
బ్యాక్టీరియా ఏం చేస్తుందో తెలుసా?
బిల్డింగ్ పగుళ్లు పూడ్చే సముద్ర బ్యాక్టీరియాపై నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే పని చేయడం ప్రారంభించింది. దీని తయారు ప్రక్రియలో బాసిల్లస్ సూడోఫార్మస్, ఒక ప్రత్యేక రకమైన సముద్ర బ్యాక్టీరియా, సిమెంట్ ద్రావణం వాడుతారు. బిల్డింగ్ లోని కాంక్రీటులో ఈ బ్యాక్టీరియా చాలా కాలం పాటు నిద్రాణంగా ఉంటుంది. బిల్డింగ్ లోని కాంక్రీటుపై తేమ వచ్చిన వెంటనే ఇది మేల్కొని లిస్టన్‌ను ఏర్పరుస్తుంది. దీని కారణంగా పగుళ్లు ఆటోమేటిక్ గా పూడిపోతాయి. ఈ ప్రక్రియ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.