Sania Mirza: సానియా మీర్జా చివరి మ్యాచ్.. హైదరాబాద్ లో స్టార్స్ సందడి!
భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ఆమె ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తన ఆట తీరుతో అందర్నీ అభిమానులుగా మార్చుకుంది. ఇప్పటికీ ఎన్నో అవార్డు లు,
- By Nakshatra Published Date - 01:48 PM, Sun - 5 March 23

Sania Mirza: భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ఆమె ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తన ఆట తీరుతో అందర్నీ అభిమానులుగా మార్చుకుంది. ఇప్పటికీ ఎన్నో అవార్డు లు, ఎన్నో టైటిల్స్ గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్ లో 8, కామన్వెల్త్ గేమ్స్ లో రెండు మెడల్స్ కూడా సాధించింది. 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ అందుకుంది.
అర్జున, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా అందుకుంది. ఇక ఈమె ఉమెన్స్ ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు మెంటార్ గా ఉంది. అయితే తాజాగా ఈమె చివరి గేమ్.. అనగా ఫేర్వెల్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా రెండు మ్యాచ్లు ఆడనుంది. సింగిల్స్ లో సానియా వర్సెస్ రోహన్ బోపన్న ఆడనున్నారు.
డబుల్స్ లో వీరిద్దరూ ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడనున్నారు. ఇక సానియా చివరి ఆట చూడటానికి తన అభిమానులతో పాటు స్పోర్ట్స్ స్టార్స్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు తరలివచ్చారు. ఇక డిన్నర్ ఏర్పాటు చేయగా.. దానికి కేంద్రం అంటి కిరణ్ రిజిజు, టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏఆర్ రెహమాన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, జహీర్ ఖాన్ తో పాటు చాలామంది పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఎమోషనల్ నోట్ పంచుకుంది. అభిమానుల కోసం చివరి మ్యాచ్ ఆడుతున్నాను అంటూ.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ చేశానో అక్కడే చివరి మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. విజయంతో కెరీర్ను ముగించాలని అనుకుంటున్నాను. నా కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయించాలని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయింది.

Related News

Sania Mirza: మొదలు పెట్టిన చోటే ముగించి… సానియా భావోద్వేగం
ఏ ఆటలోనైనా ఏదో ఒక సందర్భంలో వీడ్కోలు పలకాల్సిందే...ఎన్నో ఏళ్ల పాటు ఆటతో మమేకమై పలు విజయాలు , మరెన్నో రికార్డులు సాధించినప్పుడు...