Sachin : సచిన్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు బాధితుడి ఇంట్లో షూట్ చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. అయితే అతడు ఎందుకు తనకు తాను కాల్చుకున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
- Author : Sudheer
Date : 15-05-2024 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సెక్యూరిటీ గార్డ్ ( security guard) ప్రకాశ్ కాపీ (40) (Prakash Kapade) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సచిన్ వీవీఐపీ రక్షణలో ఉండే SRPF (స్టేట్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) సెక్యూరిటీ గార్డ్ కార్డే ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే తన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు బాధితుడి ఇంట్లో షూట్ చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. అయితే అతడు ఎందుకు తనకు తాను కాల్చుకున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రకాశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు , వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రకాష్ వ్యక్తిగత కారణాల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు చెపుతున్నారు. ప్రకాశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రకాశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులను విచారిస్తున్నారు.
Read Also : AP Violence: పల్నాడులో హింస.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గృహ నిర్బంధం