Ind Vs SA: సఫారీలదే చివరి టీ ట్వంటీ
సౌతాఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్‌ను స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు.
- Author : Naresh Kumar
Date : 05-10-2022 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
సౌతాఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్‌ను స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. చివరి టీ ట్వంటీలో సౌతాఫ్రికా భారీస్కోర్ సాధించడంతో భారత్ పోరాడి ఓడింది. దీంతో వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయిన సఫారీలు భారత్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగారు. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 227 పరుగులు చేసింది. ఆరంభంలో బవుమా ఔటైనప్పటకీ.. డికాక్, రొస్కు విధ్వంసం సృష్టించారు. రెండో వికెట్‌కు 8 ఓవర్లలోనే 90 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో డికాక్ 68 పరుగులకు ఔటవగా.. రొస్కు మాత్రం చెలరేగిపోయాడు. సిక్సర్లు, బౌండీరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
𝐂. 𝐇. 𝐀. 𝐌. 𝐏. 𝐈. 𝐎. 𝐍. 𝐒! 🏆
Congratulations to #TeamIndia on winning the T20I series win against South Africa. 👏 👏#INDvSA | @mastercardindia pic.twitter.com/VWuSL7xf8W
— BCCI (@BCCI) October 4, 2022
కేవలం 48 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో మిల్లర్ 5 బంతుల్లోనే 3 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినివ్వగా.. అర్షదీప్‌సింగ్‌కు రెస్ట్ ఇచ్చారు. దీంతో వీరి స్థానాల్లో పంత్, సిరాజ్, ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. 228 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా తొలి బంతికే రోహిత్ వికెట్ కోల్పోయింది. కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ కూడా ఔటయ్యారు. పంత్ 27 , సూర్యకుమార్ యాదవ్ 8 , అక్షర్ పటేల్ 9, హర్షల్ పటేల్ 17 రన్స్‌కు ఔటయ్యారు. దీంతో భారత్ దూకుడుగా ఆడినా వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో దీపక్ చాహల్ మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 17 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 పరుగులు చేసిన దీపక్ చాహల్ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఉమేశ్ యాదవ్ కూడా 20 రన్స్ చేసినా సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో ఫలితం లేకపోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్‌కు 178 పరుగులకు తెరపడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది.