Most Expensive Player : ఖరీదైన కబడ్డీ ప్లేయర్ గా పవన్.. ‘తెలుగు టైటాన్స్’ టీమ్ లోకి ఎంట్రీ
Most Expensive Player : ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ వ్యాల్యూ అమాంతం పెరిగిపోయింది.
- By Pasha Published Date - 11:01 AM, Wed - 11 October 23

Most Expensive Player : ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ వ్యాల్యూ అమాంతం పెరిగిపోయింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్-10 కోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెషన్ సెంటర్‌లో జరిగిన వేలంలో ‘తెలుగు టైటాన్స్’ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఇదే వేలంలో భారీ ధరను పొందిన ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ రెజా షాద్‌లూయీ చియానేహ్ రికార్డును పవన్ బద్దలుకొట్టాడు. మొహమ్మద్ రెజాను పుణేరి పల్టన్ టీమ్ రూ.2.35 కోట్లకు కొనుగోలు చేసింది. గత ప్రో కబడ్డీ లీగ్ సీజన్‌లో తమిళ్ తలైవాస్ జట్టు పవన్ కుమార్ సెహ్రావత్‌ను రూ. 2.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంపాటలో రెండో ప్లేస్ లో ఇరాన్ ప్లేయర్ మహ్మద్‌రెజా చియానెహ్ నిలిచాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్-10 డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఇందులో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, పింక్ ప్యాంథర్స్, పట్నా పైరెట్స్, పుణేరి పల్టన్స్, తమిళ్ తలైవాస్, తెలుగుటైటాన్స్, యు ముంబా, యూపీ యోథా జట్లు తలపడనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
మణీందర్ సింగ్‌ను రూ. 2.12 కోట్లకు బెంగాల్ వారియర్స్, ఇరాన్ ప్లేయర్ ఫజల్ అత్రాచలిని రూ.1.60 కోట్లకు గుజరాత్ టైటాన్స్, సిద్ధార్థ్ దేశాయ్ ను రూ.కోటికి హరియాణా స్టీలర్స్, మీటూ శర్మను రూ.93 లక్షలకు యూ ముంబా, విజయ్ మలిక్ ను రూ.85 లక్షలకు యూపీ యోధాస్, గమాన్ ను రూ.85 లక్షలకు దబంగ్ ఢిల్లీ, చంద్రన్ రంజిత్ ను రూ.62 లక్షలకు హరియాణా స్టీలర్స్, రోహిత్ గులియాను రూ.58.50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొన్నాయి. మొత్తం 12 కబడ్డీ ఫ్రాంఛైజీలు 3 కేటగిరీల్లో 84 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇందులో 22 మంది ఆటగాళ్లను ఎలైట్ రిటైన్డ్ కేటగిరీ కింద పెట్టుకున్నాయి. ఈ జాబితాను ప్రొ కబడ్డీ లీగ్ వెబ్‌సైట్‌లో (Most Expensive Player) పొందుపర్చారు.