New Zealand Squad T20 WC:టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కివీస్ జట్టు ఇదే
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు.
- Author : Naresh Kumar
Date : 20-09-2022 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సారథిగా వ్యవహరించనున్నాడు. గత కొంత కాలంగా షార్ట్ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లనే మెగా టోర్నీకి ఎంపిక చేశారు. అయితే సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. రికార్డ్ స్థాయిలో గప్తిల్ ఏడో సారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడనున్నాడు. తద్వారా అత్యధిక సార్లు మెగా టోర్నీ ఆడిన కివీస్ ప్లేయర్ గా గప్తిల్ రికార్డ్ సృష్టించనున్నాడు. గతంలో నాథన్ మెక్ కల్లమ్, రాస్ టేలర్ మాత్రమే ఆరు సార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడగా.. వారిని గప్తిల్ అధిగమించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఫెర్గ్యూసన్ , ఆడమ్ మిల్నే జట్టులోకి తిరిగి వచ్చారు. వికెట్ కీపర్ డెవాన్ కాన్వేను ఎంపిక చేశారు. కాగా తొలిసారి ఫిన్ అలెన్, బ్రాస్ వెల్ ప్రపంచకప్ కు ఎంపికయ్యారు. మెగా టోర్నీ కంటే ముందు న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లతో ట్రై సిరీస్ ఆడనుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో కివీస్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత ఎడిషన్ లో న్యూజిలాండ్ రన్నరప్ గా నిలిచింది.
న్యూజిలాండ్ జట్టు ః
విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.
Hear from Gary Stead and Kane Williamson about the squad for the @T20WorldCup in Australia. Squad Details | https://t.co/tYz2lodYAV #T20WorldCup pic.twitter.com/elhLy89dG9
— BLACKCAPS (@BLACKCAPS) September 20, 2022