RSWS 2022: ఓజా, పఠాన్ విధ్వంసం… ఫైనల్లో ఇండియా లెజెండ్స్
రిటైర్ అయినా తమలో ఆట టీ మాత్రం తగ్గలేదని రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో మాజీ ఆటగాళ్ళు నిరూపిస్తున్నారు.
- By Naresh Kumar Published Date - 08:48 PM, Thu - 29 September 22

రిటైర్ అయినా తమలో ఆట టీ మాత్రం తగ్గలేదని రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో మాజీ ఆటగాళ్ళు నిరూపిస్తున్నారు. వయసు మీద పడినా తమదైన ఆటతో అదరగొడుతున్నారు. అందుకే ఈ టోర్నీ మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. తాజాగా ఇండియా లెజెండ్స్ , ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య సెమీఫైనల్ థ్రిల్లింగ్ గా సాగింది.
ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది . ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇండియా లెజెండ్స్ ను గెలిపించారు. వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మొదట
బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా లెజెండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డంక్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 టాప్ కెప్టెన్ వాట్సన్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 30, అలెక్స్ డూలన్ 31 బంతుల్లో 5 ఫోర్లోతో 35, కామెరూన్ వైట్ 18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30 నాటౌట్ రాణించారు. భారత లెజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్ , యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్య చేదనలో ఇండియా లెజెండ్స్ తడబడింది. సచిన్ , రైనా , యువరాజ్ సింగ్ , యూసుఫ్ పఠాన్ తక్కువ స్కోర్ కే ఔటయ్యారు.
దీంతో ఇండియా లెజెండ్స్ 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనిపించింది.
ఈ దశలో నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టిన వీరిద్దరూ భారీ షాట్లతో అలరించారు. నమన్ ఓజా కేవలం 62 బంతుల్లో 90 రన్స్ చేశాడు. చివరి 4 ఓవర్లలో విజయానికి 49 పరుగులు అవసరమవ్వగా.. ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. పఠాన్
ఒక్కడే 36 పరుగులు చేశాడు. నాన్స్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఇండియా లెజెండ్స్ విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో ఇండియా లెజెండ్స్ మరో 4 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.