IPL Finals Postponed: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు ఊహించని షాకిచ్చాడు.
- By Hashtag U Published Date - 01:03 AM, Mon - 29 May 23

IPL 2023 Finals: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగాల్సిన మెగా ఫైనల్ వర్షం కారణంగా వాయిదా పడింది. ఐదు గంటల పాటు ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షంతో మైదానం తడిసి ముద్దైంది.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May – 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
— IndianPremierLeague (@IPL) May 28, 2023
పిచ్ రిపోర్ట్ సమయంలో ప్రారంభమైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో దాగుడు మూతలు ఆడిన వర్షం ఆటకు ఏ మాత్రం సహకరించలేదు. పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్‌ను వాయిదా వేసారు.