IPL 2023 Qualifier 1: ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ? ప్లే ఆఫ్ సమరానికి చెన్నై.గుజరాత్ రెడీ
ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు కౌంట్ డౌన్ మొదలయింది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫైయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
- By Nakshatra Published Date - 07:37 PM, Mon - 22 May 23
IPL 2023 Qualifier 1: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు కౌంట్ డౌన్ మొదలయింది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫైయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. సీజన్ ఆరంభం నుంచీ జట్లూ నిలకడగా రాణిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే గుజరాత్ అదరగొడుతోంది. లీగ్ స్టేజ్ ను టాప్ ప్లేస్ లో ముగించిన గుజరాత్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలని ఎదురుచూస్తోంది. ఆల్ రౌండర్లు ఆ జట్టుకు ప్రధాన బలం. బ్యాటింగ్ లో ఓపెనర్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా శుబ్ మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా రెండు షమీ ీలతో దుమ్మురేపాడు. గిల్ , సాహా ఇచ్చే ఆరంభాలే ఆ జట్టు భారీ స్కోరుకు పునాది వేస్తున్నాయి. అలాగే హార్దిక్ పాండ్య , డేవిడ్ మిల్లర్ , తేవాటియా లాంటి హిట్టర్లు కూడా గుజరాత్ కు అడ్వాంటేజ్. సాయి సుదర్శన్ లాంటి యంగ్ క్రికెటర్ కూడా రాణిస్తుండడంతో బ్యాటింగ్ లో ఆ జట్టుకు తిరుగు లేదు. చివర్లో రషీద్ ఖాన్ లాంటి బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా ఒక్కోసారి గుజరాత్ కు ప్లస్ అవుతున్నాడు. ఇక బౌలింగ్ పరంగానూ గుజరాత్ మంచి ఫామ్ లో ఉంది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తనదైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. నిలకడగా రాణిస్తున్న షమీ ఈ సీజన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు జాబితాలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. షమీ 14 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టాడు. అటు స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా 24 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరితో పాటు మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ కూడా రాణిస్తున్నారు.
మరోవైపు గత రెండు సీజన్లలో నిరాశ పరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి మాత్రం అదరగొడుతోంది. ఎప్పటిలానే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ తో చెన్నైను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. బౌలింగ్ పరంగా ఇబ్బందులు ఉన్నా…యువ బౌలర్లతో ఫలితాలు సాధిస్తున్నాడు. బ్యాటింగ్ లో ఓపెనర్ల ఫామ్ చెన్నై కి ప్లస్ పాయింట్. కాన్వే, రుతురాజ్ అదిరిపోయే ఆరంభాలను ఇస్తున్నారు. వీరిద్దరి జోరుతో చెన్నై భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. తర్వాత దూబే , మోయీన్ అలీ , రహానే , జడేజా లాంటి సీనియర్లు ఉన్నారు. చివర్లో ధోనీ ఫినిషింగ్ టచ్ ఇస్తే చెన్నైకి గెలుపు కష్టమేమీ కాదు. అటు బౌలింగ్ లో మాత్రం చెన్నై పూర్తి బలంగా లేదు. యువ బౌలర్లతోనే ధోనీ విజయాలను అందుకుంటున్నాడు. దీపక్ చాహర్ , తుషార్ దేశ్ పాండే , మహేష్ పతిరణ , తీక్షణా…నిలకడగా రాణిస్తున్నారు. మలింగా లాంటి బౌలింగ్ శైలితో
పతిరణ చెన్నై బౌలింగ్ కు కీలకంగా మారిపోయాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఇరు జట్లు తలపడినప్పుడు గుజరాత్ దే పై చేయిగా నిలిచింది. తొలి క్వాలిఫైయర్ కు వేదికగా చెపాక్ స్టేడియంలో గత రికార్డులు చెన్నైకి అనుకూలంగా ఉండడంతో ధోనీ సేన విజయం సాధించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న గుజరాత్ ను ఓడించడం అంత ఈజీ కాదు. ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ ఉన్న వేళ హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా…ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
Related News
Gujarat Titans Team Penalised : చెన్నై పై విజయం.. గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. కెప్టెన్‌కు గిల్‌కు ఏకంగా..
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది.