MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ గా ధోనీ?
ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మహేంద్రసింగ్ ధోనీ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.
- By Naresh Kumar Published Date - 05:05 PM, Fri - 25 March 22
ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మహేంద్రసింగ్ ధోనీ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ధోనీ క్రేజ్ , అతని కెప్టెన్సీ , యువ ఆటగాళ్ళను వినియోగించుకునే విధానం ఇలా తనదైన ముద్ర వేశాడు. ధోనీని, చెన్నైని వేర్వేరుగా చూడలేమన్నది అభిమానుల మాటే కాదు విశ్లేషకుల అభిప్రాయం కూడా. తాజాగా 15వ సీజన్ కు రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆశ్చర్చపరిచినా… ధోనీ నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళూ ఉన్నారు. రానున్న సీజన్ల కోసం కొత్త కెప్టెన్ ను ఇప్పటి నుంచే తయారుచేయాలన్న ఆలోచనతోనే తలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ధోనీ గురించి మరో ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. ఈ సీజన్ తోనే ఐపీఎల్ కు ధోనీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో వచ్చే సీజన్ నుంచి ధోనీ చెన్నై మెంటార్ గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం.
నిజానికి ధోనీ ఎప్పుడు రిటైరయినా, కాకున్నా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఎటువంటి ఒత్తిడీ చేయదు. ఎందుకంటే రిటైర్మెంట్ విషయంలో ధోనీదే పూర్తి నిర్ణయమని ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎస్ కే ఓనర్ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సిఈవో విశ్వనాథన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ధోనీకి ఇదే చివరి సీజన్ అనుకోవడం లేదని, అయితే గత రెండు సీజన్లలో ధోనీ ప్రదర్శన బాగోలేదని మాత్రం అంగీకరించారు,. అదే సమయంలో ఈ సీజన్ ధోనీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే తాజా సీజన్ లో ధోనీ రాణించినా కూడా వచ్చే సీజన్ లో ఆటగాడిగా కనిపించకపోవచ్చన్నది పలువురి మాట.
40 ఏళ్ళ వయసులో ధోనీ ఫిట్ నెస్ పై ఎటువంటి విమర్శలూ లేకున్నా ఆటగాడిగా మరో ఏడాది కొనసాగే అవకాశాలు లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ధోనీ ఆటగాడిగా గుడ్ బై చెప్పినా… అతన్ని సేవలు జట్టుకు ఉంటూనే ఉంటాయని గతంలోనే శ్రీనివాసన్ చెప్పారు. దీంతో వచ్చే సీజన్ లో ధోనీ మెంటార్ గా కనిపించే అవకాశముంది. ధోనీ ఎలాంటి రోల్ లో ఉన్నా చెన్నైకి అడ్వాంటేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వచ్చే సీజన్ లో కేవలం మెంటార్ తో పాటు ఇంకా అదనపు బాధ్యతలు ఏవైనా అప్పగించే అవకాశాలు లేకపోలేదు. ధోనీ గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు,. ముఖ్యంగా యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలోనూ, వారిని సానపెట్టడంలోనూ ధోనీది ఎప్పుడూ పై చేయిగా ఉంటుంది. అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ధోనీ ఒక బ్రాండ్.. అలాంటి క్రేజ్ ఉన్న తలాను వదలుకునే సాహసం చేయదు. దీనికి తోడు చెన్నై ఫ్రాంచైజీతో ధోనీది ప్రత్యేక అనుబంధం. సీజన్ ఆరంభం నుంచీ కెప్టెన్ ను మార్చని ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే అది చెన్నై మాత్రమే. మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చే సీజన్ లో ధోనీ కొత్త పాత్రలో కనిపించబోతున్నాడనేది ఖాయమైపోయింది.
Related News
Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్.. చెన్నై సీఈవో ఏమన్నారంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.