IND vs NZ 2nd ODI: భారత బౌలర్ల దూకుడు.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్!
భారత బౌలింగ్ కు దెబ్బకు న్యూజిలాండ్ 34 ఓవర్లలోనే 108 పరుగులకు అల్ ఔట్ అయ్యింది.
- Author : Balu J
Date : 21-01-2023 - 4:12 IST
Published By : Hashtagu Telugu Desk
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో (IND vs NZ 2nd ODI) భారత బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను టీమిండియా (Team india) ఫాస్ట్ బౌలర్లు వణికించారు. షమీ, సిరాజ్, శార్దూల్, హార్దిక్ మెరుగైన బౌలింగ్ చేయటంతో న్యూజిలాండ్ 34 ఓవర్లలోనే 108 పరుగులకే అల్ ఔట్ అయ్యింది. మొదటి ఓవర్లోనే స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే ఫిన్ అలెన్ (0) ను బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ వికెట్ల వేటను మొదలుపెట్టాడు.
ఆ తర్వాత హెన్రీ నికోల్స్ (20 బంతుల్లో 2) ను సిరాజ్ ఔట్ చేశాడు. డారిల్ మిచెల్ (1) ను షమీ, డెవాన్ కాన్వే (7) ను పాండ్య ఔట్ చేశారు. అనంతరం 11వ ఓవర్లో కెప్టెన్ టామ్ లాథమ్ (1) శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత అదే దూకుడుతో భారత బౌలర్లు (Team india Bowling) మెరుగైన ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన చేశాడు. కేవలం 18 పరుగులు ఇచ్చి 3 ప్రధాన వికెట్లు తీశాడు. సుందర్ మూడు ఓవర్లలో 7 పరుగులకే 2 వికెట్లు పడగొట్టి కీవిస్ ను కోలుకోకుండా దెబ్బ తీశారు.
ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా
న్యూజిలాండ్ తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ (Team India) మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. కెప్టెన్ రోహిత్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ బౌలర్లూ దూకుడుగా బౌలింగ్ చేశారు. మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ ఈ మ్యాచులో బరిలోకి దిగింది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మేం హైదరాబాద్ (Hyderabad) లో మొదట బ్యాటింగ్ చేశాం. ఇక్కడు ముందు బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) చెప్పాడు.
Also Read: Wipro Jobs Cut: ఫ్రెషర్స్ కు ‘విప్రో’ షాక్.. 400 మంది ఉద్యోగులు ఔట్!