India Playing XI 2nd ODI: రెండో వన్డేకు భారత తుది జట్టు ఇదే
India Playing XI 2nd ODI: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ను ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆదివారం రాంఛీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ అవకాశాలు చేజారకుండా ఉంటాయి.
- By Naresh Kumar Published Date - 09:33 PM, Sat - 8 October 22

India Playing XI 2nd ODI: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ను ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆదివారం రాంఛీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ అవకాశాలు చేజారకుండా ఉంటాయి. దీంతో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. దీపక్ చాహర్ గాయంతో దూరమైన నేపథ్యంలో అవేశ్ ఖాన్ జట్టులో కొనసాగనున్నాడు. తొలి వన్డేలో అవేశ్ ఖాన్ నిరాశపరిచాడు. 8 ఓవర్లలో వికెట్ తీయలేకపోయిన షాబాజ్ 51 పరుగులిచ్చేశాడు. దీంతో ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి వచ్చేందుకు మరో అవకాశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం భారత్ ను ఆరో బౌలర్ ఆప్షన్ వేధిస్తోంది. తుది జట్టు కూర్పును పరిశీలిస్తే ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు ప్రధాన బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశముంది.. అయితే ఆరో బౌలర్ ఆప్షన్ గా షాబాజ్ అహ్మద్ అరంగేట్రం చేస్తాడని అంచనా వేస్తున్నారు.
పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, శార్థూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్ ఆడనుండగా.. స్పిన్నర్లుగా కుల్ దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ కొనసాగనున్నారు. అటు ఓపెనర్లుగా ధావన్, గిల్ , ఇషాన్ కిషన్, శ్రేయా,్ అయ్యర్ టాపార్డర్ లో కీలకం కానున్నారు. తొలి వన్డేలో సంజూ శాంసన్ చివరి వరకూ పోరాడినా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో 13 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శార్థూల్ ఠాకూర్ లోయర్ ఆర్డర్ లో కీలకమయ్యే అవకాశముంది. మొత్తం మీద సిరీస్ చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో తుది జట్టులో మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా ః
శిఖర్ ధావన్ ( కెప్టెన్ ), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్ ) , షాబాజ్ అహ్మద్ , శార్థూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్ , కుల్ దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ , మహ్మద్ సిరాజ్