world cup 2023: మ్యాక్స్ వెల్ విధ్వంసం.. 128 బంతుల్లో 201 నాటౌట్
ముంబయి వాంఖెడే స్టేడియం ఉత్కంఠగా మారింది ఆఫ్ఘానిస్తాన్ లాంటి జట్టుపై ఓడిపోతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆఫ్ఘన్ జట్టులో అప్పటివరకు ఉన్న ఉత్సాహం నీరుగారింది.
- By Praveen Aluthuru Published Date - 11:22 PM, Tue - 7 November 23

world cup 2023: ముంబయి వాంఖెడే స్టేడియం ఉత్కంఠగా మారింది ఆఫ్ఘానిస్తాన్ లాంటి జట్టుపై ఓడిపోతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆఫ్ఘన్ జట్టులో అప్పటివరకు ఉన్న ఉత్సాహం నీరుగారింది. మ్యాక్స్ వెల్ పెను విధ్వంసానికి హద్దుల్లేకుండాపోయాయి. ఆఫ్ఘనిస్థాన్ తో పోరులో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ మ్యాక్స్ వీరోచిత పోరాటినికి ప్రత్యర్థి జట్టే సలాం కొట్టినంత పనైంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్(Maxwell) 128 బంతుల్లో 201 పరుగులతో వాంఖడేలో విధ్వంసం సృష్టించాడు. ఒక్క ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో మైదానాన్ని యుద్దభూమిగా మార్చేశాడు. ఒక్కో పరుగును కూడగడుతూ అర్థ సెంచరీ చేసిన మ్యాక్సీ.. ఆ తర్వాత గేర్ మార్చాడు. ఫోర్లు, బౌండరీలతో వాంఖెడేలో శివాలెత్తాడు. దీంతో 292 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఛేదించిన స్కోరులో మిగిలిన బ్యాటర్లంతా చేసింది 92 పరుగులైతే మ్యాక్సీ చేసింది 201. మ్యాక్స్ చేసిన విధ్వంసానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయింది.
Also Read: Modi : మోడీ మంత్రమే బిజెపి ఏకైక అస్త్రం