CWG2022: గ్రాండ్ గా కామన్ వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీ
ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు అట్టాహసంగా జరిగాయి.
- By Naresh Kumar Published Date - 08:38 AM, Fri - 29 July 22

ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు అట్టాహసంగా జరిగాయి. దాదాపు 30 వేల మంది ప్రేక్షకుల మధ్య 72 దేశాల క్రీడాకారులు జాతీయ పతాకాల్ని ధరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు.
ఈ గేమ్స్ ప్రారంభమవుతున్నట్లుగా ప్రిన్స్ ఛార్లెస్ అధికారికంగా ప్రకటించడంతో వేడుకలు మొదలయ్యాయి. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయపడటంతో భారత జట్టు ఫ్లాగ్ బేరర్లుగా డబుల్ ఒలింపిక్ విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు హాకీ టీమ్ కెప్టెన్ మన్ ప్రీత్ వ్యవహరించారు. ఈ పరేడ్ లో గత ఏడాది క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా ప్లేయర్స్ పరేడ్ లో పాల్గొనగా…చివరగా ఇంగ్లాండ్ క్రీడాకారులు స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు.
Flagbearers @Pvsindhu1 and @manpreetpawar07 lead #TeamIndia out in the Parade of Nations at the #B2022 Opening Ceremony 🇮🇳🎆
What a moment! 😍#EkIndiaTeamIndia | @birminghamcg22 pic.twitter.com/rKFxWTzMfz
— Team India (@WeAreTeamIndia) July 28, 2022
ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బ్రిటన్ ఫేమస్ బ్యాండ్ డ్యూరన్ డ్యూరన్ లైవ్ షో హైలైట్ గా నిలిచింది. . పాకిస్థాన్ క్రీడాకారుల బృందానికి ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించింది.ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం అనుమానంగా మారింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ కూడా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. ఆయా దేశాల క్రీడాకారులు విభిన్నమైన దుస్తుల్లో పరేడ్ లో పాల్గొనగా శ్రీలంక ప్లేయర్స్ మాత్రం స్పోర్ట్స్ డ్రెస్ లో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. ఆగస్ట్ 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. దాదాపు 72 దేశాలకు చెందిన ఐదు వేల మంది అథ్లెట్లు పతాకాల కోసం పోటీపడబోతున్నారు. ఈ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్ ను చేర్చారు. కాగా నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు.
Related News

Zimbabwe Tour : జింబాబ్వేతో వన్డే సిరీస్…జట్టును ప్రకటించిన బీసీసీఐ…కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!!!
ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మొదలు కానున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చారు.