IPL 2025: ఎవరీ ఐపీఎల్ “మిస్టరీ గర్ల్”
ఐపీఎల్ 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఓ మిస్టరీ గర్ల్ ఫోటోలు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా ఆ అమ్మాయి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
- By Kode Mohan Sai Published Date - 03:34 PM, Tue - 25 March 25

ఐపీఎల్ 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతుంది. ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ కేకేఆర్ ని ఓడించి తొలి విజయాన్ని అందుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఇక ఐపీఎల్ లోనే అత్యంత భయంకర జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ పై 286 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో ఓ మిస్టరీ గర్ల్ ఫోటోలు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా ఆ అమ్మాయి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కెమెరామెన్ ఓ అమ్మాయిని హైలెట్ చేశాడు. ఆమె ఒక ప్రముఖ క్రికెటర్ భార్యగా చెబుతున్నారు. తన భర్తకు మద్దతుగా స్టేడియంలో సందడి చేసి అందర్నీ ఆకట్టుకున్న ఆమె పేరు మిథాలీ ఠాకూర్. ఆమె గురించి తెలుసుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆమె టీమిండియా స్టార్ ఆటగాడి భార్య అని తెలిసి షాక్ అవుతున్నారు. ఆమె భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ భార్య. ఈ మ్యాచ్ సందర్భంగా ఆమె విశాఖపట్నం స్టేడియంలో కనిపించింది. ఠాకూర్ బౌలింగ్ కి ఆమె సంతోషంతో సంబరాలు చేసుకుంది. కెమెరామెన్ ఆమెను ఫోకస్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె గురించే శోధిస్తున్న పరిస్థితి.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట అతను జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను, తరువాత అభిషేక్ పోరెల్‌ను తన ప్రమాదకరమైన బంతులకు బలిపశువులను చేశాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్ 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రిషబ్ పంత్ అతన్ని పూర్తి ఓవర్ బౌలింగ్ చేయనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోలేదు. శార్దూల్ ఠాకూర్ పై ఒక్క ఫ్రాంచైజీ కూడా బిడ్ వేయలేదు. ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ మరో ఆటగాడికి ప్రత్యామ్నాయంగా టోర్నమెంటులోకి ప్రవేశించాడు. గాయపడిన మొహ్సిన్ ఖాన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. శార్దూల్ గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. 18వ సీజన్‌కు ముందే ఈ ముంబై ఆటగాడిని చెన్నై విడుదల చేసింది.