England Win Series: ఇంగ్లాండ్ దే చివరి టీ ట్వంటీ .పాక్ పై సీరీస్ కైవసం
పాకిస్థాన్ తో జరిగిన ఏడు మ్యాచ్ ల టీ ట్వంటీ సీరీస్ ను ఇంగ్లాండ్ 4-3 తేడాతో కైవసం చేసుకుంది.
- By Naresh Kumar Published Date - 12:15 AM, Mon - 3 October 22

పాకిస్థాన్ తో జరిగిన ఏడు మ్యాచ్ ల టీ ట్వంటీ సీరీస్ ను ఇంగ్లాండ్ 4-3 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టీ ట్వంటీలో 67 పరుగుల తేడాతో ఆతిథ్య పాక్ ను చిత్తు చేసింది.మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 209 పరుగులు చేసింది.
SERIES VICTORY!!! 🦁🦁🦁
A brilliant 7-match series, thank you @TheRealPCB 👏
🇵🇰#PAKvENG 🏴 pic.twitter.com/ZQKX8Ad7KG
— England Cricket (@englandcricket) October 2, 2022
39 పరుగులకు 2 వికెట్లు కోల్పోయినా…డేవిడ్ మలాన్ , డకెట్ , బ్రూక్స్ మెరుపులతో భారీ స్కోరు సాధించింది. మలాన్ 47 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్సర్లతో 78 రన్స్ చేయగా… డకెట్ 19 బంతుల్లో 30 , బ్రూక్స్ 29 బంతుల్లో 1 ఫోర్ , 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. భారీ లక్ష్య చేధనలో పాకిస్థాన్ పెద్దగా పోటీ ఇవ్వలేక పోయింది. అంచనాలు పెట్టుకున్న బాబర్ అజాం, రిజ్వన్ నిరాశ పరిచారు. మసూద్ హాఫ్ సెంచరీతో పోరాడినా…మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.
దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లను 142 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 3 , విల్లీ 2 వికెట్లు పడగొట్టారు. ఏడు మ్యాచ్ ల సీరీస్ హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ , తర్వాత పాకిస్థాన్…మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ , నాలుగు, అయిదు మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిస్తే… ఆరు, ఏడు మ్యాచ్ లలో గెలిచిన ఇంగ్లాండ్ సీరీస్ కైవసం చేసుకుంది.
Thank you, Pakistan ❤️
After 17 years of waiting, a wonderful cricket series and the wamest welcome from the people of this country 👏
🇵🇰#PAKvENG 🏴 pic.twitter.com/OUSRvMgZDM
— England Cricket (@englandcricket) October 2, 2022