HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Check How India Can Still Qualify For Asia Cup Finals

Team India Asia Cup: భారత్ ఫైనల్ చేరాలంటే ఈ అద్భుతాలు జరగాల్సిందే

ఆసియా కప్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్...లీగ్ స్టేజ్ తర్వాత ఇక కప్ మనదే...సూపర్ 4 స్టేజ్ మొదలయ్యాక అంచనాలన్నీ తలకిందులు...

  • Author : Naresh Kumar Date : 07-09-2022 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
india team
india team

ఆసియా కప్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్…లీగ్ స్టేజ్ తర్వాత ఇక కప్ మనదే…సూపర్ 4 స్టేజ్ మొదలయ్యాక అంచనాలన్నీ తలకిందులు…రెండు మ్యాచ్ ల్లో ఓడి ఫైనల్ రేస్ నుంచి దాదాపుగా ఔట్…కేవలం సాంకేతికంగా మాత్రమే రేసులో ఉంది… ఇదీ టీమిండియా పరిస్థితి. శ్రీలంకతో మ్యాచ్ లో ఓటమి తర్వాత భారత్ ఫైనల్ చేరే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన టీమ్ ఫైనల్ ఛాన్స్ మిగిలిన జట్లపై ఆధారపడి ఉంది. రోహిత్ సేన ఫైనల్ రేసులో నిలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

ఇప్పటికే రెండు విజయాలతో శ్రీలంక దాదాపుగా ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ చెరో రెండు మ్యాచులు ఆడనున్నాయి. వాటిలో ఒక్కటి గెలిచినా వాటికి కూడా ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. సూపర్-4లో ఇవాళ అఫ్గాన్-పాక్ పోరులో విజేతను బట్టి ఈ టోర్నీలో భారత భవితవ్యం తేలిపోనుంది. నేటి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ పాకిస్తాన్ ను ఓడిస్తేనే భారత్ రేసులో ఉంటుంది పాకిస్తాన్ గెలిస్తే రోహిత్ సేన కథ పూర్తిగా ముగుస్తుంది. గురువారం అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ భారీ తేడాతో ఘనవిజయం సాధిస్తే రన్ రేట్ కూడా పెరుగుతుంది. భారత్ ఫైనల్ బెర్త్ కు అదే కీలకమవుతుంది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ లో లంక ఓడిపోవాలి. లేకుంటే భారత్ ఇంటిదారి పట్టాల్సిందే. వీటన్నింటికీ మించి ఫైనల్ బెర్త్ కు నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది.

ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్ రేట్ +0.351గా ఉంది. రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ నెట్ రన్ రేట్.. +0.125గా ఉండగా మూడో స్థానంలో ఉన్న భారత్.. -0.125గా ఉంది. అఫ్గాన్ -0.589 తో నాలుగో స్థానంలో ఉంది. ఈ సమీకరణాలు అన్ని ఇలా జరిగితే…ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అద్భుతాలు జరిగితేనే టీమిండియా ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అయితే గెలవాల్సిన మ్యాచ్ లలో ఓడిపోయి..ఇలా మిగిలిన జట్లపై ఆధారపడడం భారత్ లాంటి టీమ్ కు సరికాదు అన్నది కొందరి అభిప్రాయం. కానీ మన క్రికెట్ ఫాన్స్ మాత్రం ఈ అద్భుతాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా ఇవాళ్టి పాక్ , ఆఫ్గన్ మ్యాచ్ తో టీమిండియా కథ తేలిపోనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2022
  • india vs srilanka
  • super 4
  • team india

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

    • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

    Trending News

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd