HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Abhishek Sharma Net Worth And Car Collection

Abhishek Sharma: అభిషేక్ శర్మ నికర విలువ, గ్యారేజిలో లగ్జరీ కార్లు

ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. ఆరంభ మ్యాచ్ లో జట్టును విజయతీరాలకు చేర్చిన అభిషేక్ చివరి మ్యాచ్ లో భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు.

  • Author : Naresh Kumar Date : 03-02-2025 - 5:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Abhishek Sharma
Abhishek Sharma

ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. ఆరంభ మ్యాచ్ లో జట్టును విజయతీరాలకు చేర్చిన అభిషేక్ చివరి మ్యాచ్ లో భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అభిషేక్ ఎదుర్కొన్న ప్రతి బంతికి వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ ఊచకోతకు డగౌట్ లో కూర్చున్న గంభీర్ తో సహా ఇతర క్రికెటర్లు చప్పట్లతో మోత మోగించారు. కేవలం 54 బంతుల్లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

క్రికెట్ కారిడార్లో అభిషేక్ శర్మ పేరు మారుమ్రోగుతుంది. 24 సంవత్సరాల వయస్సులో తాను దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట నమోదు కావడంతో టి20లో అతని స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దీంతో అతన్ని టీమిండియా భవిష్యత్తు స్టార్ గా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే అతని నెట్ వర్త్ పై వివరాలు సేకరిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ 4 సెప్టెంబర్ 2000లో జన్మించాడు. వయస్సు ఈ రోజుకి 24 సంవత్సరాల 152 రోజులు. జన్మస్థలం అమృత్సర్. ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు.

2015-16లో విజయ్ మర్చంట్ దేశవాళీ అండర్-16 టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ మొదట అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అక్కడ అతను ఏడు మ్యాచ్‌ల్లో 1200 పరుగులు చేశాడు. ఆ తర్వాతి సీజన్‌లో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 2018లో భారత అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో అతను కూడా ఒక సభ్యుడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 50 పరుగులు చేసి 11 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. దీని తరువాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతన్ని 2018 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో 19 బంతుల్లో 46 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత కొన్ని సీజన్లలో తన జోరును కోల్పోయాడు. 2022 సంవత్సరంలో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున నాల్గవ సీజన్ ఆడి 426 పరుగులు చేశాడు.

అభిషేక్ శర్మ నికర విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 12 కోట్లు. క్రికెట్ కాకుండా అతను బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి డబ్బు సంపాదిస్తాడు. ఐపీఎల్ లో అతని జీతం రూ. 14 కోట్లు. టి20లో ఒక్కో మ్యాచ్ కి 3 లక్షలు తీసుకుంటున్నాడు. కాగా అభిషేక్ శర్మ తన కుటుంబంతో కలిసి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని ఒక సంపన్న ప్రాంతంలో నివసిస్తున్నాడు. అభిషేక్ శర్మకు కూడా కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో 1 BMW 3 సిరీస్‌తో సహా అనేక కార్లు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek Sharma
  • Abhishek Sharma Assets
  • Abhishek sharma Car Collection
  • Abhishek Sharma Life Style

Related News

Sunil Gavaskar

అభిషేక్ శర్మపై సునీల్ గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంపై సునీల్ గవాస్కర్ కీలక సూచనలు ఇచ్చాడు. మొదటి బంతికే భారీ షాట్లు ఆడే అలవాటు తగ్గించుకుని, ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించుకోవాలని సూచించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సెమీఫైనల్ అవకాశాలు కష్టమయ్యాయి. జింబాబ్వే, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్‌లలో ఒక్కటి

  • Abhishek Sharma

    అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd