Aayan Khan: 16 ఏళ్ళకే వరల్డ్ కప్ ఆడేస్తున్నాడు
ఊహించినట్టుగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంచలనాలతో ఆరంభమైంది.
- By Naresh Kumar Published Date - 10:39 PM, Sun - 16 October 22

ఊహించినట్టుగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంచలనాలతో ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకకు పసికూన నమీబియా షాకిచ్చింది. మరో మ్యాచ్ లో యుఏఈపై నెదర్లాండ్స్ గెలిచింది. రెండు చిన్న జట్ల మధ్య జరిగిన ఈ పోరు కూడా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో పలు రికార్డుల మోత మోగింది. యూఏఈ ఆటగాడు అయాన్ అఫ్జల్ ఖాన్ అత్యంత చిన్న వయసులో టీ20 వరల్డ్‌కప్ ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాక్ బౌలర్ మహ్మద్ అమీర్ పేరిట ఉండగా.. దానిని అయాన్ బ్రేక్ చేశాడు.
అమీర్ 17 ఏళ్ల 55 రోజుల వయసులో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడగా.. అయాన్ 16 ఏళ్ల 335 రోజుల వయసులోనే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడి రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడిన అత్యంత పిన్నవయస్కుల జాబితాలో అయాన్, అమీర్ తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిలిచాడు. రషీద్ ఖాన్ 17 ఏళ్ల 170 రోజుల్లో వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
🗣️ "It's a dream for me."
UAE's 16-year-old prodigy, Aayan Khan is ready to announce himself under the bright lights of #T20WorldCup 2022.
— ICC (@ICC) October 15, 2022