HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >A Hard Blow To Team Indias Cricket They Lost Their Ranks Too

Team India: టీం ఇండియా క్రికెట్ కు గట్టి దెబ్బ… ర్యాంకులు కూడా కోల్పోయారుగా !

టీం ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఘోరంగా ఓడిపోయారు. దీనివల్ల నెంబర్ వన్ స్థానాన్ని తన చేతులారా పోగొట్టుకున్నారు.

  • Author : Anshu Date : 23-03-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
22 03 2023 Ind Vs Aus Top 5 Villian 23364236
22 03 2023 Ind Vs Aus Top 5 Villian 23364236

Team India: టీం ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఘోరంగా ఓడిపోయారు. దీనివల్ల నెంబర్ వన్ స్థానాన్ని తన చేతులారా పోగొట్టుకున్నారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఎంత ఇంపార్టెంటో ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ కూడా అంతే ముఖ్యం.వరల్డ్‌ కప్‌ రిహార్సల్స్ అని భావించిన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఓడిపోయి క్రికెట్ భారతావనికి నిరాశ తెప్పించారు.

అస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోవటం వల్ల తమ ర్యాంకింగ్ లను కూడా కోల్పోయారు మన క్రికెటర్లు. ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ హాజిల్‌వుడ్‌ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ 702 పాయింట్లతో ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 3వికెట్లు తీసిన హైదరాబాదీ పేసర్‌ రెండో వన్డేలో మూడు ఓవర్లలోనే 37రన్స్‌ ఇచ్చాడు. దీంతో భారీగా ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోయాడు. అయితే షమీకి మాత్రం ఈ పాయింట్లు పస్ల్ అయ్యాయి. ముంబై వన్డేలో భారత్‌ను గెలిపించిన మహ్మద్‌ షమీ అయిదు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

అటు తొలి వన్డేలో 75 పరుగులతో టీమ్‌ఇండియాను గెలిపించిన రాహుల్‌ మూడు స్థానాలు మెరుగై 39వ ర్యాంక్‌కు చేరుకోగా, గిల్‌, కోహ్లీ అయిదు, ఏడు ర్యాంక్‌లలో కొనసాగుతున్నారు. కెప్టెన్ రోహిత్ మాత్రం 9వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • cricket
  • team india

Related News

Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd