HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >22 Runs In One Ball 30 Years For This Worst Decision In Cricket

22 runs in one ball: క్రికెట్ లో ఈ చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు

క్రికెట్ లో ఒక్క బంతికి 22 పరుగులు చేయాలి. మీరు చదువుతోంది నిజమే. క్రికెట్ చరిత్రలోనే అదో వండర్. కాకపోతే అదో చెత్త నిర్ణయం అని కూడా అంటారు. అసలేమిటీ కథా అని చూస్తే..

  • Author : Naresh Kumar Date : 23-03-2022 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cricket
Cricket

క్రికెట్ లో ఒక్క బంతికి 22 పరుగులు చేయాలి. మీరు చదువుతోంది నిజమే. క్రికెట్ చరిత్రలోనే అదో వండర్. కాకపోతే అదో చెత్త నిర్ణయం అని కూడా అంటారు. అసలేమిటీ కథా అని చూస్తే.. 1992 వన్డే ప్రపంచకప్ ను గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది. ఆనాడు ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య పోరు జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లండ్ దే కావడంతో ఆరు వికెట్లు కోల్పోయి.. 252 పరుగులు చేసింది. తరువాత సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. కానీ ఆ టీమ్ ను ఎప్పటిలాగే బ్యాడ్ లక్ మాత్రం వెంటాడింది.

ఆరోజు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జోరుగా ఆడింది. మంచి ఫామ్ లో ఉండడంతో ఇక ఆ మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. అంటే ఓవర్ కు కనీసం 11 పరుగులు చేస్తే చాలు. ఇక మ్యాచ్ కొట్టేసినట్టే అనుకున్న టైమ్ లో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఓ పది నిమిషాల తరువాత వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. అప్పటికే సౌతాఫ్రికా ఆటగాళ్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్.. ఇద్దరూ బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక టార్గెట్ ను బద్దలుకొట్టడమే ఆలస్యం అనుకునేలోగా.. అంపైర్లు తీసుకున్న నిర్ణయం వారిని షాకయ్యేలా చేసింది. ఎందుకంటే వర్షం వల్ల బంతులను కుదించిన అంపైర్లు పరుగులను మాత్రం తగ్గించలేదు. దీంతో ఒక్క బంతికే 22 పరుగులు చేయాల్సి వచ్చింది. అయినా ఒక్క బంతికీ 22 పరుగులు ఎలా చేయాలో.. ఆ ఆటగాళ్లకు కాని, సౌతాఫ్రికా టీమ్ కు కాని, అసలు క్రికెట్ అభిమానులకు కాని ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఆ ఒక్క బంతినీ ఆడి.. గెలవకుండానే ఇంటిబాట పట్టింది దక్షిణాఫ్రికా జట్టు.

అయినా పది నిమిషాలు వర్షం పడితే 12 బంతులను తగ్గించిన అంపైర్లు.. పరుగులను మాత్రం ఎందుకు తగ్గించలేదు? అప్పట్లో అంపైర్ల నిర్ణయం పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. తరువాత డక్ వర్త్ లూయిస్ పద్దతిని తీసుకువచ్చింది. అలా 30 ఏళ్ల కిందట తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికీ క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • India World Cup
  • sports

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

  • హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

  • జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

  • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd