Phone Shocked: ఫోన్ మాట్లాడుతుండగా యువతికి షాక్.. మరో ఇద్దరికి కూడా!
ఫోన్ మాట్లాడుతుండగా యువతికి కరెంట్ షాక్ తగిలింది.
- Author : Balu J
Date : 16-01-2023 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఫోన్ మాట్లాడుతుండగా యువతికి కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. యువతి హాస్టల్ గదిలో కిటికీలు తెరిచి ఫోన్ మాట్లాడుతోంది. అయితే కిటికీకి అటువైపు అతి సమీపంలో విద్యుత్ పోల్ ఉంది. ఫోన్‌కు అటాచ్ చేసి ఉన్న పవర్ బ్యాంక్ నుంచి సడెన్‌గా కరెంట్ సప్లై కావడంతో యువతి షాక్ గురైంది. దీంతో కిందపడిపోయిన యువతిని కాపాడేందుకు మరో ఇద్దరు అమ్మాయిలు ప్రయత్నించగా వాళ్లకు షాక్ తగిలింది. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి విషమం ఉన్నట్టు తెలుస్తోంది.