AC: ఏసీ లేకపోయినా ఇంటిని కూల్ చేసుకోవవచ్చు.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు
ఎండాకాలం మొదలైపోయింది. ఉదయం 7 గంటలకే ఎండ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకే మండిపోయే ఎండ వస్తుంది. ఇక ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది.
- By Nakshatra Published Date - 09:35 PM, Wed - 12 April 23
AC: ఎండాకాలం మొదలైపోయింది. ఉదయం 7 గంటలకే ఎండ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకే మండిపోయే ఎండ వస్తుంది. ఇక ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో అయితే ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో అత్యవసరమైతే తప్పు బయటకు రాకపోవడం మంచిదని వాతావరణశాఖ సూచిస్తోంది.
అయితే ఎండాకాలం ఇళ్లల్లో ఏసీ వినియోగం పెరుగుతోంది. ఏసీ ఉన్న ప్రతిఒక్కరూ ఏసీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొంతమంది ఎండ ప్రభావానికి తట్టుకోలేక ఏసీలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో సమ్మర్లో ఏసీలు ఎక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి. అయితే ఏసీ లేకపోయినా ఇంటిని చల్లగా చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుకోవాలని ఉందా.. అయితే ఇక చదివేయండి..
ఎండ ఇంటి లోపలికి రాకుండా కిటికీలు మూసివేస్తే రూమ్ చల్లగా మారుతుంది. అయితే రూమ్‌లో వెంటిలేటర్ ఉండేలా చూసుకోవడం మంచిది. ఇక ఎండాకాలంలో ఇంట్లో గడ్డితో తయారుచేసిన మ్యాట్లను కిటికీలకు కర్టెన్లుగా వాడాలి. దీని వల్ల ఇంట్లోకి వేడి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గడ్డి వల్ల రూమ్ చల్లగా అవుతుంది. ఇక రూమ్ చల్లగా ఉండాలంటే కిటికీల ముందు ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్కలను పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కలకు కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని, దీని వల్ల ఇంట్లోకి ఎండ రాదని అంటున్నారు.
అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఉపయోగించడం వల్ల గదిలో వేడి తగ్గుతుందని చెబుతున్నారు. రూమ్ చల్గగా అవుతుందని అంటున్నారు. అలాగే కిటికీలో తడి బట్టలు వేలాదదీయడం వల్ల ఎండను అడ్డుకుంటుందని, రూమ్ లో చల్లగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇక రూమ్ ఏసీలాగా చల్లగా అవ్వాలంటే టేబులు ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ గడ్డలను వేసి ఉంచాలి. ఫ్యాన్ గాలి ఐస్ గడ్డలను తడలడం వల్ల రూమ్ కూల్‌గా అవుతుంది. అలాగే ఇంటి పైకప్పుకు తెలుపు రంగు పెయింట్ వేయాలి. తెలుపు రంగు ఎండను అడ్డుకుంటుంది. దీని వల్ల రూమ్ చల్లగా ఉంటుంది.
Tags
Related News
Summer: సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగడం మస్ట్.. ఎందుకంటే
Summer: వేసవి కాలంలో శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి, పుష్కలంగా నీరు తాగడంతోపాటు కొబ్బరిని తాగడం చాలా ముఖ్యం. వేసవిలో లిక్విడ్ డైట్ తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో నీటి కొరత లేకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగండి. దీని కారణంగా, శరీరంలో తగినంత శక్తి, ఖనిజాల సమతుల్యత ఉంది. వేసవిలో ఎప్పుడైనా కొబ్బరి న�