YCP MLC : మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. సాక్షిగా సంతకం చేసిన రెండో భార్య
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన మూడో పెళ్లికి సాక్షిగా రెండో భార్య వెళ్లి
- Author : Prasad
Date : 28-11-2023 - 2:41 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన మూడో పెళ్లికి సాక్షిగా రెండో భార్య వెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకం చేయడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. ఏలూరు రేంజ్ పరిధిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుజాతను ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత సునీత అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిన పెళ్లిలో అధికారికంగా వీరిద్దరూ ఒక్కటయ్యారు. దీంతో ఆయన మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లయింది.
Also Read: Malla Reddy : బిజినెస్ మాన్ చూసి రాజకీయాల్లోకి వచ్చా – మంత్రి మల్లారెడ్డి