HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ycp Leaders Silence On Mp Gorantla Nude Video

MP Gorantla Issue: `డ‌ర్టీ పిక్చ‌ర్`పై ఆ నలుగురు

ఏపీ మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌. మ‌హిళా స‌మస్య‌ల‌పై వెంట‌నే స్పందించే నైజం ఆమెది.

  • Author : CS Rao Date : 05-08-2022 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ap
ap

ఏపీ మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌. మ‌హిళా స‌మస్య‌ల‌పై వెంట‌నే స్పందించే నైజం ఆమెది. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగితే ఫిర్యాదు లేక‌పోయిన‌ప్ప‌టికీ సుమోటోగా విచార‌ణ చేసే అధికారం చైర్ ప‌ర్స‌న్ హోదాలో విశేషాధికారులు ఉన్నాయి. కానీ, ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో విష‌యంలో మౌనంగా ఉన్నారు. బ‌హుశా బాధిత మ‌హిళ నుంచి ఫిర్యాదులేద‌ని సైలెంట్ గా ఉన్నార‌నుకుందాం. ఇలాంటి స‌మ‌యంలో సుమోటోగా ఆ వీడియో మీద విచార‌ణ జ‌ర‌పాల్సిన బాధ్య‌త మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ గా ఆమెకు లేక‌పోలేదు. ఎందుకంటే, స‌భ్యస‌మాజం త‌ల‌దించుకునేలా మ‌హిళ‌ని లోబ‌రుచుకున్న దృశ్యం అది. ఎంపీ హోదాలో ఆయ‌న చేసిన వికృత చేష్ట‌లపై ప్రాథ‌మిక విచార‌ణ చేసే మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ కు ఉంది. ఎంపీ గోరంట్ల మాధ‌వ్ చెబుతున్న‌ట్టు ఆ వీడియో మార్ఫింగ్ చేశారా? నిజ‌మా? అనే విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొచ్చు. కానీ, ఆమె సైలెంట్ గా ఉండ‌డాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు ప్ర‌శ్నించ‌డ‌మే కాకుండా ఎక్క‌డికి వెళ్లార‌ని నిల‌దీస్తున్నారు.

ఇక మ‌ద్యం, మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై ముందుండి పోరాడే ఐర‌న్ లేడీ మంత్రి రోజా. సుదీర్ఘ పోరాటాలు మ‌హిళల భ‌ద్ర‌త కోసం ఉద్య‌మించారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ..ఇలా ఏ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ సాధిక‌ర‌త‌, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం రోజా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ప్ర‌తి అంశానికీ ఆమె ముందుకొస్తూ రాజ‌కీయంగా నోరు పెద్ద‌ది చేసుకుంటారు. కానీ, ఇప్పుడు గోరంట్ల మాధ‌వ్ వీడియో విష‌యంలో మౌనంగా ఉన్నారు. అదే, ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్ల వీడియో అయితే, ఈ పాటికి పెద్ద నోరు చేసుకుని ముందుకొచ్చేద‌ని నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు. మంత్రి హోదాలో ప్ర‌స్తుతం ఉన్న రోజా వైసీపీ ఎంపీ మాధ‌వ్ వీడియో చూశారా? లేదా? అనే టాక్ న‌డుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబునాయుడి కుటుంబ వ్య‌వ‌హారాల‌ను కూడా బజారుకు తీసుకొచ్చే లక్ష్మీపార్వ‌తి రెండు రోజుల క్రితం ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు గోరంట్ల మాధ‌వ్ వీడియో గురించి మాట్లాడేందుకు చుక్కాని వేసినా ఆమె దొర‌క‌డంలేదు.

వైసీపీకి చెందిన రోజా రాణి ఇటీవల ఆ పార్టీ త‌ర‌పున ఫైర్ బ్రాండ్ గా మారారు. తెలుగు మ‌హిళా అధ్యక్షురాలు, అయ్య‌న్న‌పాత్రుడు వ్యాఖ్య‌లకు ప్ర‌తిగా మీడియా ముందుకొచ్చి బూతుపురాణం వినిపించారు. మ‌హిళ‌లకు అండ‌గా ఆమె నిల‌బ‌డుతున్నారు. మంత్రి రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా రోజారాణి ప్ర‌త్య‌ర్థుల‌పై ఎగ‌సిప‌డుతున్నారు. ఇప్పుడు గోరంట్ల మాధ‌వ్ వీడియో విష‌యంలో మిన్న‌కుండిపోయారు. ఆ పార్టీ నుంచి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మిన‌హా ఎవరూ నోరుమెద‌ప‌డంలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఆ పార్టీ టీమ్ చీమ‌కుట్టిన‌ట్టు ఉన్నారు. నెట్ జ‌న్లు మాత్రం వాసిరెడ్డి, రోజా, రాణి, లక్ష్మీపార్వ‌తి ఎక్క‌డున్నారు? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికైనా వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియోపై మ‌హిళా ఫైర్ బ్రాండ్స్ స్పందిస్తారేమో చూద్దాం.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gorantla Madhav
  • nude
  • RK Roja
  • vasireddy padma
  • viral video

Related News

T20 World Cup 2026

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో గొడ‌వ‌.. వీడియో వైర‌ల్‌!

బంతి తగలగానే మిచెల్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. ఆ వెంటనే అంపైర్ అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చజెప్పారు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మిచెల్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి అతనితో మాట్లాడి శాంతింపజేశాడు.

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd