Cinema: హీరో నానిపై వైసీపీ నేతల ఫైర్
- By hashtagu Published Date - 11:43 AM, Fri - 24 December 21
హీరో నానిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హీరో నాని సినిమాలకు తీసుకుంటోన్న పారితోషికం ఎంత? అంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘పారితోషకాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకీ లేదు!’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
పారితోషకాన్ని వెల్లడించకుండా
సినిమా టికెట్ ధర గురించి
మాట్లాడే నైతిక అర్హత
ఏ "హీరో"కి లేదు!— Ambati Rambabu (@AmbatiRambabu) December 24, 2021
‘శ్యామ్ సింగరాయ్’ ప్రచారంలో భాగంగా నాని మాట్లాడుతూ .. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని, సినిమా హాళ్ల కంటే కిరాణా దుకాణాల కలెక్షన్ ఎక్కువగా ఉంటుందని ఆయన ఎద్దేవా చేసిన నేపథ్యం వైసీపీ నాయకులు స్పందించారు. మరోవైపు, నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఈ రోజే విడుదలైంది.
Related News
Nani : జనసేనాని పవన్ కల్యాణ్‌కు నేచురల్ స్టార్ నాని మద్దతు
Natural Star Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ పోరులో తలపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్‌కు మెగా ఫ్యామిలి నుండి కూడా మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్�