Nara Lokesh : నారా లోకేష్ మీటింగ్‌లో వైసీపీ నేతలు..?
- By Prasad Published Date - 01:04 PM, Thu - 9 June 22

పదవ తరగతి విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ జూమ్ మీటింగ్ లో పలువురు వైసీపీ నేతలు ప్రత్యక్షమైయ్యారు. జూమ్ మీటింగ్ మధ్యలో వీడియోలోకి వల్లభనేని వంశీ, కొడాలి నాని రావడంతో టీడీపీ నేతలు లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు. వల్లభనేని వంశీ ఆఫీసులో ఉండి జూమ్ మీటింగ్ ఓ విద్యార్థిని లాగిన్ అవ్వగా.. మరో విద్యార్థి పేరుతో మాజీ మంత్రి కొడాలి నాని లాగిన్ అయ్యారు. ఇద్దరు వైసీపీ నేతలు కనిపించడంతో నిర్వాహకులు వారిని జూమ్ మీటింగ్ నుంచి తొలిగించారు. అయితే మీటింగ్ సమయంలో నారా లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. స్టూడెంట్స్ పేరుతో వైసీపీ నేతలు రావడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈ జూమ్ మీటింగ్.. ఎప్పుడో పదవ తరగతి తప్పి, పద్దతి తప్పిన వాళ్లకు కాదంటూ లోకేష్ చురకలు అంటించారు. దీంతో ఇద్దరు వైసీపీ నేతలు మీటింగ్ నుంచి వెళ్లిపోయారు.

Nara Lokesh