Yash KGF2:’యష్’ దెబ్బకు ‘సల్మాన్’ రికార్డ్ ఔట్..!
'కేజీఎఫ్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన తాజా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’.
- By Hashtag U Published Date - 12:46 PM, Mon - 18 April 22
‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన తాజా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజై, దుమ్ము దులిపే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల ‘బాహుబలి-2’ రికార్డులను తిరగరాసిన ఈ మూవీ… లేటెస్ట్ గా గా బాలీవుడ్ హీరోలను కలవరపెడుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తున్నారు రాఖీ భాయ్. తాజాగా సల్మాన్ ఖాన్ ను ‘కేజీఎఫ్’ క్రేజ్ తో వెనక్కి నెట్టాడు యష్. సల్మాన్ ఖాన్ ఓపెనింగ్ వీకెండ్ చిత్రాల వసూళ్లను దాటేశాడు. మూడురోజుల్లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో రూ.140 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సల్మాన్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. తొలిమూడు రోజులు సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రం రూ.114.93 కోట్లు వసూళ్లు చేసి బిగ్గర్ ఓపెనింగ్ వీకెండ్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు ‘రేస్ 3’తో రూ.106.47 కోట్లు, ‘సుల్తాన్’ తో రూ.105.53 కోట్లు వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు సల్లూ భాయ్. అయితే రాఖీ భాయ్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూడు రోజుల్లో రూ. 140 కోట్ల వసూళ్లు రాబట్టి సల్మాన్ ఖాన్ రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో సౌత్ ఇండియా నుంచి సినిమాలు విడుదలవుతున్నాయి అంటేనే బాలీవుడ్ బడా హీరోలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి యష్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’కి ఉన్న క్రేజ్ చూస్తే చాలా ఈజీగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను కూడా బ్రేక్ చేసేట్టుగా కనిపిస్తోంది. హుంబలే ఫిల్మ్ప్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా… హీరో యష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించారు. బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ అధీర పాత్రలో మెప్పించారు. రవీనా టాండన్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ పలు కీలక పాత్రలను పోషించారు. మొత్తంగా రాఖీ భాయ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తో ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకు వెళ్తున్నాడు.
Tags
Related News
Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్ డైరెక్టర్, పాన్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్?
Jacqueline Fernandez: సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా అరి అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్�