Solar Roofed Cycling: నార్సింగిలో ప్రపంచ స్థాయి సోలార్ రూఫ్డ్ సైక్లింగ్ ట్రాక్
తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది.
- By Balu J Published Date - 11:50 AM, Mon - 10 April 23

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. పట్టణ, గ్రామీణ రంగాల రూపురేఖలు సైతం మారుతున్నాయి. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. వేగంగా వెళ్లే వాహనాల కోసం విశాలమైన లేన్‌ల పక్కన, (ORR) సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను ఏర్పాటుచేయబోతోంది. ఈ ట్రాక్ వల్ల సూర్యుడు, వర్షం, ఇతర వాతావరణ పరిస్థితుల నుండి సైక్లిస్టులకు రక్షణ కలుగుతుంది. ప్రయాణ భద్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ప్రధాన ట్రాఫిక్ నుండి వారిని వేరు చేస్తుంది. ఈ తరహా విధానం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి.