England: 36 ఏళ్లుగా అతనిని తండ్రి అనుకున్న యువతి.. తీరా తల్లి మాటలు విని షాక్?
ఇంగ్లండ్‌లోని టిఫనీ గార్డ్‌నర్ తన తండ్రి క్యాన్సర్‌తోనే మరణించాడనే భావనతోనే పెరిగి పెద్దయ్యింది. అతని సొంత తల్లి, సవతి తండ్రి ఏలోటూ లేకుం
- Author : Anshu
Date : 23-07-2023 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంగ్లండ్‌లోని టిఫనీ గార్డ్‌నర్ తన తండ్రి క్యాన్సర్‌తోనే మరణించాడనే భావనతోనే పెరిగి పెద్దయ్యింది. అతని సొంత తల్లి, సవతి తండ్రి ఏలోటూ లేకుండా ఆమెను ఆలనాపాలనా చూస్తున్నారు. అయితే టిఫనీ చిన్నప్పటి నుంచి తన అసలు తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూవస్తోంది. మృతి చెందిన తన తండ్రి ఔరక్ మేక్ నుంచి తనకు ఏ గుణాలు వచ్చాయో తెలుసుకోవాలనుకునేది. తన తండ్రి బతికి ఉంటే అతనితో తన అనుబంధం ఎలా ఉండేదో అని ఆలోచిస్తూ ఉండేది. అలా మూడు దశాబ్ధాలుగా తన కన్న తండ్రి మరణించాడని భావిస్తూ వచ్చిన ఆమెకు ఒకరోజు అసలు నిజం తెలిసింది.
2018లో టిఫనీకి తాను ఒక అజ్ఞాత వ్యక్తి డొనేట్ చేసిన స్మర్మ్ నుంచి పుట్టినదానినని తెలిసింది. దీంతో తన తండ్రి ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడని ఆమెకు అనిపించింది. టిఫనీ ది మిర్రర్ తో మాట్లాడుతూ తన తల్లి తన పెంపుడు తండ్రి దగ్గర ఒక మాట తీసుకున్నదని, దాని ప్రకారం తన నిజమైన తండ్రి ఎవరో తనకు చెప్పకూడదని తన తల్లిదండ్రులిద్దరూ నిర్ణయించుకున్నారని తెలిపింది. పైగా 1982లో వైద్యులు కూడా ఇన్‌ఫెర్టైల్ బాధితులకు తాము ఎవరి నుంచి స్మెర్మ్ తీసుకున్నామనేది గోప్యంగా ఉంచేవారు. తన జీవితం ఒక్కసారిగా మారిపోయిన రోజును టిఫనీ ఎప్పటికీ మరచిపోలేదు.
టిఫనీకి తన 36వ జన్మదినాన ఈ విషయం తెలిసింది. ఇంటిలోని వంటగదిలో తల్లి స్వయంగా ఈ విషయాన్ని టిఫనీకి తెలిపింది. తల్లి మాటలు వినగానే టిఫనీ షాక్ అయ్యింది. అలా ఆలోచించుకుంటే తన మంచి కోసమే తల్లి ఇన్నాళ్లూ ఈ సంగతిని దాచివుంచిందని ఆమెకు అనిపించింది. తనకు తల్లీదండ్రులతో సహజమైన అనుబంధం కొననాగాలనే ఉద్దేశంతోనే ఈ విషయం ఇన్నాళ్లూ చెప్పలేదని టిఫనీకి తల్లి తెలిపింది..