Gandhi Hospital : వైద్యురాలిపై దాడి
Attack On Junior Doctor In Gandhi Hospital : ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువు దాడికి పాల్పడ్డాడు.
- By Sudheer Published Date - 09:13 PM, Wed - 11 September 24

Attack On Junior Doctor In Gandhi Hospital : కలకత్తాలో జూనియర్ డాక్టర్ (Kolkata Doctor Incident) పై జరిగిన దాడి దేశం మొత్తాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. ఒక్క కలకత్తా లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లపై అనేక దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు పొసే..డాక్టర్ల ఫై ప్రాణాలు పోయేలా దాడులు (Attacks) చేయడం పట్ల యావత్ డాక్టర్స్ ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు డిమాండ్స్ చేయగా..ప్రభుత్వాలు సైతం డాక్టర్స్ ఫై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రతి హాస్పటల్ లో నోటీసులు అంటించారు. అయినాగానీ దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట డాక్టర్ ఫై దాడి అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.
తాజాగా హైదరాబాద్ గాంధీ హాస్పటల్ (Gandhi Hospital) లో మహిళా జూ. డాక్టర్ (Junior Doctor) ఫై దాడి (Attack ) జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్ లాగి డాక్టర్‌పై దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది ఆమెను కాపాడారు. దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
పోలీసులు వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోగి బంధువు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి ఘటనను జూనియర్ డాక్టర్లు సీరియస్ గా తీసుకున్నారు. తమకు రక్షణ లేదని, అధిక సమయం అయినా ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటే తమ ప్రాణాలే కోల్పోయేలా ఉన్నాం అంటూ ఆంగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#AartiRavi#attackon_GANDHI_doctor
Attacks on lady doctors still continued
Lady doctor attacked by patient publicly in casualty in Gandhi hospital Hyderabad.Hatsoff to patient attendent and patient care worker immediately responded
Kolkata episode everyone know how a lady… pic.twitter.com/9sXS8pDhG7
— Dr vasanth kumar gourani (@vasant5577) September 11, 2024
Read Also : Devara Trailer Records : రికార్డు సృష్టించిన ‘దేవర’ ట్రైలర్