Tiktok: ఇండియాలోకి టిక్‌టాక్, BGMI మళ్ళీ వస్తున్నాయహో!!
షార్ట్ వీడియో యాప్ "టిక్‌టాక్".. గేమింగ్ యాప్ "BGMI" మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- By Hashtag U Published Date - 07:32 AM, Mon - 8 August 22
షార్ట్ వీడియో యాప్ “టిక్‌టాక్”..
గేమింగ్ యాప్ “BGMI” మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన Sky esports కంపెనీ సీఈవో శివనంది ఈ విషయాన్ని వెల్లడించారు.టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌తో Sky esports కంపెనీ ఇటీవల చర్చలు జరిపిందన్నారు. టిక్ టాక్‌ను మళ్లీ పునరుద్ధరించే అంశంపై ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని శివనంది వివరించారు. BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమ వుతుందని వెల్లడించారు.
ఒకవేళ ఈ అంచనాలే నిజమైతే.. 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన టిక్‌టాక్ మళ్లీ ఇండియాలోకి వచ్చేస్తుంది. వాస్తవానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి టిక్‌టాక్‌ను తీసివేయడానికి వారం ముందు, ప్రభుత్వం క్రాఫ్టన్ హెచ్‌క్యూకి మధ్యంతర నోటీసులు పంపిందని శివనంది చెప్పారు. అందుకే చాలా అడ్వాన్స్ మొత్తాన్ని Sky esports లీగ్, LAN ఢిల్లీకి చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. గత నెలలో హీరా నందాని కంపెనీతోనూ బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపింది. కాగా, చైనాతో ఘర్షణల కారణంగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర యాప్‌లను కేంద్రం నిషేధించింది.
టిక్ టాక్ ఫీవర్..
మనదేశంలో టిక్ టాక్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో వీడియోలు చూడడం లేదా వీడియోలు తీసి అప్ లోడ్ చేయడం అలవాటుగా మారింది చిన్నాపెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ టిక్ టాక్ లోనే గంటలు గంటలు గడిపేశారు. ఇంకో అడుగు ముందుకేసి వారే టిక్ టాక్ వీడియోలు చేసే స్థాయికి వెళ్లిపోయారు. ఇలా టిక్ టాక్ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయిన వారెందరో.. తమ లోని ప్రతిభను బయటకు తీసేందుకు టిక్ టాక్ ను నెటిజన్లు ఓ మంచి సాధనంగా మలుచుకున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, జోక్స్ చేయడం, ఫన్నీ వీడియోలు చేయడం, వంటలు, విశేషాలు, చిట్కాలు, ఆరోగ్యం ఇలా అది ఇదీ అనే తేడా లేకుండా మునిగితేలారు. దీంతో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై స్టార్లుగా మారారు. టిక్ టాక్ స్టార్ అనే బిరుదును తెచ్చుకున్నారు. అయితే.. టిక్ టాక్ చైనా యాప్ కావడం, భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కేంద్రం టిక్ టాక్ ను నిషేధించింది. దేశభద్రతకు ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈ యాప్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
టిక్‌టాక్‌ను కేంద్ర నిషేధించడంతో నెటిజన్లు ఇతర యాప్ లను వినియోగించుకోవడం ప్రారంభించారు. ఎంఎక్స్ టకాటాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, చింగారి వంటి యాప్‌లు పాపులర్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ యాప్‌లలో యూజర్లు మళ్లీ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. కాగా.. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ భారతీయ యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే మళ్లీ ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Tags
Related News
TikTok: అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. యాప్ నిషేధానికి అనుకూలంగా 352 ఓట్లు..!
ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యుఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది.