టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-బంగ్లాదేశ్ వివాదంపై ఐసీసీ జోక్యం!
ఒకవేళ ఈ మ్యాచులను శ్రీలంకకు తరలిస్తే, లాజిస్టిక్స్ పరంగా నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు అది పెద్ద సవాలుగా (నైట్మేర్) మారే అవకాశం ఉంది.
- Author : Gopichand
Date : 06-01-2026 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
ICC: ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుండి తొలగించిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడమే కాకుండా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జోక్యంతో బంగ్లాదేశ్ తన మొండిపట్టును వీడి, వేదిక మార్పు డిమాండ్‌పై పునరాలోచించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
చర్చలు, ఐసీసీ మధ్యవర్తిత్వం
‘ది టెలిగ్రాఫ్’ నివేదిక ప్రకారం.. బీసీసీఐ (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారుల మధ్య ఐసీసీ మధ్యవర్తిత్వంలో పలు సమావేశాలు జరిగాయి. వేదిక మార్పు డిమాండ్‌పై పునరాలోచించడానికి బంగ్లాదేశ్ కొంత సమయం కోరింది. అయితే తమ దేశ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
Also Read: ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అలర్ట్.. పూర్తి వివరాలీవే!
ఐసీసీ ఇచ్చిన హామీలు
బంగ్లాదేశ్‌ను ఒప్పించేందుకు ఐసీసీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. బంగ్లాదేశ్ జట్టు సౌకర్యార్థం షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది. భారత పర్యటనలో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ వివాదం కేవలం రెండు జట్ల మధ్య మాత్రమే కాదని, దీని వెనుక అభిమానులు, బ్రాడ్కాస్టర్లు, మీడియా ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.
ఆర్థిక సమీకరణాలు, ప్లాన్-బి
ఐసీసీ అవసరమైతే ‘ప్లాన్-బి’ని అమలు చేయగలదు. కానీ భారత్-బంగ్లాదేశ్ చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు అయిన బీసీసీఐతో శత్రుత్వం పెట్టుకోవడం బంగ్లాదేశ్‌కు ఆర్థికంగా నష్టదాయకమని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌తో మ్యాచ్‌లు ఆడటం వల్ల ఇతర బోర్డుల ఖజానా నిండుతుందని, అందుకే బీసీసీఐతో సత్సంబంధాలు కొనసాగించడం అందరికీ మంచిదని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
షెడ్యూల్ సవాళ్లు
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచులు ముంబై, కోల్‌కతాలలో జరగాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచులను శ్రీలంకకు తరలిస్తే, లాజిస్టిక్స్ పరంగా నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు అది పెద్ద సవాలుగా (నైట్మేర్) మారే అవకాశం ఉంది.