HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Will 5 States Result Push Kcr Prashant Kishor To Change Strategy

Telangana Politics: తెలంగాణలో ముందస్తు గాలులు.. కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్కెచ్ ఏమిటి?

ఇక్కడ చిటికేస్తే అక్కడ సౌండ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత..

  • Author : Hashtag U Date : 11-03-2022 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Delhi
Kcr Delhi

ఇక్కడ చిటికేస్తే అక్కడ సౌండ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. ఆ ప్రకంపనలు బీజేపీయేతర రాష్ట్రాల్లోని పార్టీలకు, ప్రభుత్వాలకు బీపీ పెంచుతున్నాయి. అసలే బీజేపీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫుల్ గా కార్నర్ చేసింది. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, విమర్శలు, ఆరోపణలతో ముప్పేట దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరయ్యేలా పొగపెడుతోంది. ఇలాంటి సమయంలో ఐదు రాష్ట్రాల రిజల్ట్ తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

తెలంగాణలో 80కి పైగా సీట్లు గెలుస్తాం.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఓవైపు బీజేపీ పెద్ద హామీలు ఇస్తోంది. ఇదే సమయంలో ఈ గడ్డపై కమలం అడ్రస్సే గల్లంతు చేయడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఓ ప్లాన్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందుకే రాష్ట్రంతోపాటు దేశంలోనే బీజేపీని లేకుండా చేయడానికి ఫ్రంట్ పేరుతో అడుగులు వేస్తున్నారు. కానీ అక్కడి సంగతి తరువాత.. ముందు కాళ్లకిందకు వస్తున్న నీటిని ఆపండంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎలా పనిచేయనుంది?

ఇప్పుడున్న మోదీ హవాను తట్టుకుని.. కమలం హోరులో కొట్టుకుపోకుండా ఉండాలంటే.. మరోసారి ముందస్తుకు వెళ్లడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఓ రిపోర్ట్ ను గులాబీ బాస్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ డిసెంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేస్తారని.. బీజేపీని బూచిగా చూపించి మార్చిలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని పొలిటికల్ టాక్.

దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో హస్తవాసి బాగాలేకపోయినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పాదయాత్రలతో ముందుకు దూసుకెళుతోంది. అటు బీజేపీ తన ప్రచారంలో జోరు పెంచింది. అయినా సరే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలే తమకు శ్రీరామరక్ష అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరగడం, 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ముందుకు రావడం వంటి చర్యల వల్ల అన్ని వర్గాల్లోనూ సంతృప్తి ఉందని విశ్వసిస్తున్నాయి. అందుకే ముందస్తు వ్యూహాన్ని అనుసరిస్తే మేలని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • early polls in telangana
  • prashant kishor
  • telangana politics
  • TRS politics

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • 20 Years of Revanth Reddy's Political Journey

    Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

Latest News

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd