Wife & Husband : రెండో పెళ్లి చేసుకున్న భర్తకు బుద్ధి చెప్పిన భార్య
రెండో పెళ్లి చేసుకున్న భర్తను భార్య చితక్కొట్టింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం..
- By Prasad Published Date - 02:19 PM, Sat - 17 September 22

రెండో పెళ్లి చేసుకున్న భర్తను భార్య చితక్కొట్టింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలకు శ్రీకాంత్ రెడ్డితో నాలుగేళ్ల క్రిందట వివాహమైంది. ఈ జంటకు కొడుకు పుట్టాడు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బంధువుల సాయంతో భర్తను అఖిల గ్రామానికి రప్పించింది. ఆ తరువాత స్తంభానికి కట్టేసి, చెప్పుతో కొట్టింది.