HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Why Telangana Minister Ktr Is Up Against Secunderabad Cantonment

KTR: తెలంగాణలో కంటోన్మెంట్ వివాదం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. ఎప్పుడూ కూల్ గా కనిపించే మంత్రి కేటీఆర్.. కంటోన్మెంట్ బోర్డు అంశంపై మండిపడ్డారు. దీనికి కారణం ఉంది.

  • By Hashtag U Published Date - 10:44 AM, Sun - 13 March 22
  • daily-hunt
KTR
KTR

తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. ఎప్పుడూ కూల్ గా కనిపించే మంత్రి కేటీఆర్.. కంటోన్మెంట్ బోర్డు అంశంపై మండిపడ్డారు. దీనికి కారణం ఉంది. ఆర్మీ పరిధిలో ఉన్న ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఉంది. అంతమాత్రాన తెలంగాణ ప్రభుత్వం కాని, జీహెచ్ఎంసీ కాని సూచనలు చేస్తే పట్టించుకోరా అన్నది కేటీఆర్ అభ్యంతరం. కానీ దీని వెనుక కారణాలు తెలియాలంటే.. ఈస్టిండియా కంపెనీ రోజులకు వెళ్లాలి.

ఏఎస్ఐ సమీపంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో చెక్ డ్యామ్ ను నిర్మించారు. కానీ దానివల్ల చేరిన నీటితో ఆ దిగువ భాగంలో ఉన్న నదీమ్ కాలనీలోకి నీరు వచ్చేస్తోంది. ఇది ఆ ప్రాంత వాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైగా కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చాలాసార్లు సూచనలు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఇలా లాభం లేదనుకుని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పరిస్థితి ఇలాగే ఉంటే నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించారు. దీంతో అందరి దృష్టీ దీనిపై పడింది. అసలేంటీ కంటోన్మెంట్ వివాదమని చూస్తే.. అప్పట్లో ఈస్టిండియా కంపెనీవాళ్లు మన దేశంలో ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల కోసం రక్షణను ఏర్పాటుచేసుకున్నారు. ఆ సాయుధ బలగాలు ఉండే ప్రాంతాన్నే కంటోన్మెంట్లుగా పిలిచేవారు. నిజాం జమానాలోనే సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ ఉంది. స్వాతంత్ర్యం తరువాత అది మన సైన్యం పరిధిలోకి వచ్చింది. కాకపోతే కాలక్రమంలో… అంటే 1956లో ఆ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాలను హైదరాబాద్ మున్సిపాలిటీలో చేర్చారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం దాదాపు 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఆర్మీ చేతుల్లో దాదాపు ఏడువేల ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 3 వేల ఎకరాల్లో ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఈ ప్రాంతం ఇప్పటికీ కంటోన్మెంట్ బోర్డు పరిపాలనలోనే ఉంటుంది. ఈ బోర్డు ఆర్మీ నిర్వహణలో ఉంటుంది. ఈ కంటోన్మెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ మధ్యలో ఉండడంతోనే సమస్యంతా వచ్చింది. అంటే.. మారేడ్ పల్లి, మల్కాజ్ గిరి, నేరేడ్ మెంట్.. ఇలా ఈ ప్రాంతాలకు వెళ్లే రోడ్లను ఆర్మీ అధికారులు ఆరేళ్ల కిందటే బ్లాక్ చేశారు. అదేమంటే భద్రతాపరమైన చర్యలని చెప్పారు. తరువాత ప్రభుత్వం, ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు పగటిపూట మాత్రం రాకపోకలకు అనుమతిస్తున్నారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • ktr
  • Secunderabad cantonment board
  • Telangana Minister KTR

Related News

Key discussions in Erravalli.. KCR, Harish Rao discuss future strategy

BRS : ఎర్రవల్లిలో కీలక చర్చలు..భవిష్యత్ వ్యూహంపై కేసీఆర్, హరీష్ రావు మంతనాలు

ఇది ఆ పార్టీ ఆవిష్కరించబోయే భవిష్యత్ మార్గసూచిపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ఫామ్ హౌస్ మూడవ అంతస్తులో దాదాపు రెండు గంటలపాటు సాగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

  • Do you know why CM Revanth Reddy thanked Owaisi?

    Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?

  • BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

    BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Raja Singh objects to police restrictions.. Where is your right to control Hindu festivals? !

    Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

Latest News

  • Gold Price : దిగొచ్చిన బంగారం ధరలు

  • Shocking : వామ్మో… 510 కేజీల బరువు ఎంత సింపుల్ గా ఎత్తాడు

  • Jammu Kashmir : జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

  • Russia : క్యాన్సర్‌ను ఎదుర్కొనే టీకాను అభివృద్ధి చేసిన రష్యా

  • Onion Prices : భారీగా పడిపోయిన ఉల్లి ధరలు!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd