HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Who Wins In G23 Vs Congress Political War

Congress: జీ23 Vs కాంగ్రెస్.. పొలిటికల్ వార్ గెలిచేదెవరు?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురవ్వడంతో పార్టీలో అసమ్మతి వర్గానికి బలం చేకూరింది. అందుకే జీ-23 లీడర్లు ఇప్పటికే గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు.

  • Author : Hashtag U Date : 18-03-2022 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
G23 Gulam Nabi
G23 Gulam Nabi

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురవ్వడంతో పార్టీలో అసమ్మతి వర్గానికి బలం చేకూరింది. అందుకే జీ-23 లీడర్లు ఇప్పటికే గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు. కాంగ్రెస్ పరాజయం తరువాత వాళ్లు సమావేశం కావడం అదే తొలిసారి కావడంతో అందరి దృష్టీ వారిపైనే ఉంది. మొత్తానికి వాళ్లేం చేయాలనుకున్నారో అదే చెప్పారు. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలో.. అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని వారికీ తెలుసు.

సమిష్టి నాయకత్వాన్ని తయారుచేయడం ద్వారా అన్ని స్థాయిల్లోనూ నిర్ణయాలను తీసుకోవడానికి వీలవుతుందని జీ-23 అభిప్రాయపడింది. దీంతోపాటు కాంగ్రెస్ భావజాలంతో సారూప్యత ఉన్న పార్టీలతో కలిసికట్టుగా 2024 ఎన్నికలకు సిద్ధమవ్వాల్సి ఉందని ఆ నేతలంతా చెప్పారు. అప్పుడే బీజేపీని ఎదుర్కోగలమన్నారు. దీనిపై భవిష్యత్ చర్యలను త్వరలో ప్రకటించే ఛాన్సుంది. కానీ వారి మాటలను కాంగ్రెస్ వినే పరిస్థితి ఉందా?

కపిల్ సిబల్ అయితే ఏకంగా గాంధీలే పార్టీ నాయకత్వం నుంచి వైదొలగాలి అని చెప్పారు. అది ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే గతంలో కొన్నిసార్లు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గాంధీల కుటుంబం కాకుండా, పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. అయినా గాంధీల ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పలేం. పైగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే దేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే ఛరిష్మా ఉన్న నాయకుడు లేరు. కేవలం గాంధీల కుటుంబం వల్లే ఇప్పటికీ అది సాధ్యమవుతోంది.

సోనియాగాంధీ రాజీనామ చేస్తానన్నా సరే.. సీడబ్ల్యూసీలో ఎక్కువమంది అంగీకరించలేదు. పార్టీ రాష్ట్ర నాయకత్వాలు కూడా గాంధీల కుటుంబంపైనే విశ్వాసాన్ని ఉంచాయి. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీల కుటుంబం ప్రభావం లేకుండా కాంగ్రెస్ విజయం సాధించడం కూడా కష్టం. పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే నష్టనివారణా చర్యలను చేపట్టింది. ఐదుగురు పీసీసీ అధ్యక్షులను రిజైన్ చేయమని కోరింది. దీంతో పార్టీ క్యాడర్ లో కూడా చలనం వచ్చింది.

జీ-23 లీడర్ల డిమాండ్ ఏమిటంటే.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్నే పునర్వ్యవస్థీకరించాలని. మధ్యంతర ఎన్నికల ద్వారా పార్టీ అధ్యక్షుని స్థానాన్ని భర్తీ చేయాలని. కానీ కేవలం 23 మంది నేతల మాటలు విని పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పలేం. అయినా ఇప్పటికే జీ23 నేతల్లో జితిన్ ప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యోగానంద శాస్త్రి ఎన్సీపీలో చేరిపోయారు. అందుకే వీరి బలం ఇప్పుడు 21కి పడిపోయింది. అలాంటప్పుడు వారిని పట్టించుకునేవారు ఎవరు? మొత్తానికి జీ23కి, కాంగ్రెస్ కు జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో గెలిచేదెవరో, ఓడేదెవరో త్వరలోనే తేలే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • congress debacle
  • congress high command
  • g23 congress leaders
  • Ghulam Nabi Azad
  • sonia gandhi

Related News

T Congress

Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షీన‌ట‌రాజ‌న్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపే

  • Dk Shiva Kumar

    Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • Siddaramaiah

    Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

  • siddaramaiah-and-dk-shivakumar

    Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd