WhatsApp Call Back Alert : వాట్సాప్ వెబ్ లో “కాల్ బ్యాక్” ఫీచర్
WhatsApp Call Back Alert : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.. అయితే ఆ ఫీచర్ "వాట్సాప్ వెబ్" వినియోగదారుల కోసం!!
- Author : Pasha
Date : 16-06-2023 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
WhatsApp Call Back Alert : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది..
అయితే ఆ ఫీచర్ “వాట్సాప్ వెబ్” వినియోగదారుల కోసం!!
వాట్సాప్ మొబైల్ యాప్ వెర్షన్‌లో ఇప్పటికే “మిస్డ్ కాల్ అలర్ట్” ఫీచర్ ఉంది.
అయితే ఈ ఫీచర్ త్వరలోనే “వాట్సాప్ వెబ్” వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
“కాల్ బ్యాక్” ఫీచర్ త్వరలోనే వాట్సాప్ వెబ్ లో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ “మిస్డ్ కాల్” నోటిఫికేషన్ కనిపించనుంది. ప్రసుతం ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. మీరు కావాలంటే ఈ కొత్త ఫీచర్ ను మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో(Microsoft Store) చూడొచ్చు. బీటా టెస్టర్లు Microsoft Store నుంచి WhatsApp వెబ్ యాప్ వెర్షన్ 2.2323.1.0ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఫీచర్ ను టెస్ట్ చేయొచ్చు.
Also read : WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై సరికొత్త కీబోర్డు?
ఇప్పుడు Microsoft Storeలోని WhatsApp వెబ్‌లో “కాల్ బ్యాక్” (WhatsApp Call Back Alert) ప్రాంప్ట్ కనిపిస్తోందని WABetaInfo ఒక న్యూస్ రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. ఈ ఫీచర్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వినియోగదారులు కాల్ బ్యాక్ ఐకాన్‌పై ట్యాప్ చేసిన వెంటనే రిటర్న్ కాల్ చేసే వెసులుబాటు ఉంటుందని వెల్లడించింది. “మిస్డ్ మెసేజ్” లు అంటే ఇంకా తెరిచి చూడని మెసేజ్ లు. మిస్డ్ మెసేజ్ లను సేవ్ చేసే సదుపాయం కూడా ఈ కొత్త అప్ డేట్ లో ఒక భాగంగా ఉంటుంది.