WhatsApp:ప్రక్షాళన చేపట్టిన వాట్సప్.. 1.75 మిలియన్ ఖాతాలపై నిషేధం
ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా నవంబర్‌లో భారతదేశంలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు మెటా కంపెనీ గా భాగస్వామిగా ఉన్న వాట్సాప్ తెలిపింది.
- By Hashtag U Published Date - 12:35 PM, Sun - 2 January 22

ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా నవంబర్‌లో భారతదేశంలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు మెటా కంపెనీ గా భాగస్వామిగా ఉన్న వాట్సాప్ తెలిపింది. దేశ వ్యాప్తంగా నవంబర్ నెలలో వాట్సప్ కు 602 ఫిర్యాదులు స్వీకరించింది. వీటిలో 36 ఫిర్యాదులపై చర్య తీసుకుంది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం తాము నవంబర్ నెలలో ఆరవ నెలవారీ నివేదికను ప్రచురించామని.. దీనిలో వాట్సప్ ని దుర్వినియోగంపై నివారణ చర్యలు తీసుకున్నామని వాట్సప్ ప్రతినిధి తెలిపారు. తాజా నివేదిక తరువాత నవంబర్ నెలలో 1.75 మిలియన్ వాట్సప్ ఖాతాలను నిషేధించినట్లు తెలిపారు. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది. వాట్సాప్‌కు భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. తమ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని తెలిపారు.