Grand Mothers: బామ్మలు సర్పింగ్ చేస్తే ఎలా ఉంటుందంటే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
70 ఏళ్ల బామ్మ సర్ఫింగ్ చేస్తూ పాపులర్ అవుతోంది. ఇంత వయస్సులోనూ సర్పింగ్ చేస్తూ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. టెక్సాస్ కు చెందిన వెండి వొరెల్ అనే 70 ఏళ్ల వయస్సు గల బామ.. ఇప్పుడు కూడా సర్పింగ్ చేస్తోంది.
- By Nakshatra Published Date - 09:54 PM, Sun - 7 May 23
GrandMothers: 70 ఏళ్ల బామ్మ సర్ఫింగ్ చేస్తూ పాపులర్ అవుతోంది. ఇంత వయస్సులోనూ సర్పింగ్ చేస్తూ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. టెక్సాస్ కు చెందిన వెండి వొరెల్ అనే 70 ఏళ్ల వయస్సు గల బామ.. ఇప్పుడు కూడా సర్పింగ్ చేస్తోంది. ఎంతోమందిలో ఇలా స్పూర్తిని నింపుతోంది. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. సర్పింగ్ లో ఎంతోమందిలో స్పూర్తిని కలిగిస్తోంది.
సర్పింగ్ అంటే ఒక గేమ్. నీళ్లల్లో ఆడే ఆట. నీళ్లపై రేసింగ్ చేయడాన్నే సర్పింగ్ గేమ్ అంటారు. ఇటీవల ఈ గేమ్ లు బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే గ్రాహీణ బామలు గోవాలో సర్ఫ్ బొర్డులతో సర్పింగ్ కు వెళితే ఎలా ఉంటుందో మీరు ఊహించారా.. చూడటానికి చాలా బాగుంటుంది కదా.. దీనిని మీకు చూడాలనిపిస్తుంది కదా.. అయితే గ్రామీణ బామ్మలు గోవాలో సర్పింగ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో నిజం చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అశిష్ జోన్ అనే యూజర్ ఒక గ్రామీణ బామలు సర్పింగ్ చేస్తే ఎలా ఉంటుదనే దానిపై ఏఐ సాంకేతికతో పొటో చేశాడు. ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. నానీస్ ఎట్ ది బీచ్ అనే క్యాప్షన్ ఈ ఫొటోకు ఇచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఫొటోనే కాదు.. బామ్మలు నిజంగానే సర్పింగ్ చేస్తే ఎంత బాగుంటుందో అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ వెండి వొరెల్ వీడియో చూడండి అంటూ కామెంట్స్ చేశాడు.ఈ ఫొటోలకు లైక్ లు, కామెంట్లు తెగ వస్తున్నాయి.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.