Most Expensive Place : ఈ భూమండలం మీద అత్యంత ఖరీదైన స్థలం ఏది?
అవును. ఈ భూమండం మీద అత్యంత ఖరీదై౦ది (Expensive) అదే. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్ల మంది పుట్టారు. మరణించారు.
- By Maheswara Rao Nadella Published Date - 11:28 AM, Wed - 4 October 23

Most Expensive Place on Earth : ఓ సంస్థ బోర్డు సమావేశంలో ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పసాగారు. “గల్ఫ్ దేశాలు“, “KGF వజ్రాల గనులు“, “కోకాపేట్ భూములు“.. ఇలా రకరకాల జవాబులు వచ్చాయి.
“No” అంటూనే చివరగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. “ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం (Most Expensive Place) .. స్మశాన వాటిక” (Grave Yard) అంటూ ఓసారి అందరివైపు తిరిగి చూసాడు. అంతా నిశ్శబ్దంగా అతనివైపే చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to join.
“అవును. ఈ భూమండం మీద అత్యంత ఖరీదై౦ది (Most Expensive) అదే. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్ల మంది పుట్టారు. మరణించారు. వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమ తెలివితేటలను ప్రపంచానికి పంచారు. మిగతా వారంతా తమ మేధస్సును, ఆలోచనలను, అద్భుతమైన తెలివితేటలను తమలోనే దాచుకొని ఈ లోకాన్ని వీడిపోయారు. అవి వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి ప్రయోజనం లేకుండా పోయింది. అవన్నీ వారితో పాటే సమాధి అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ ఉంటుంది!?” అని అనగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
అందుకే సృజనాత్మకతను మనలోనే దాచుకొని సమాధుల్లో శాశ్వత నిద్రకు వెళ్లొద్దు. వాటిని ఈ ప్రపంచానికి పంచి వెళ్లాలి. ఈ లోకాన్ని వీడేలోగా మనలోని మంచిని ప్రపంచానికి అందజేసి వెళ్లాలి. మన ఆలోచనలను ఆచరణలో పెట్టి వెళ్లాలి. మనలోని జ్ఞానాన్ని నలుగురికి అందించి వెళ్లాలి. ఏదీ దాచుకుని వెళ్లొద్దు. అంతా ఖాళీ చేసి వెళ్లాలి!
Also Read: Journalists are Terrorists? : జర్నలిస్టులు ఉగ్రవాదులా…?